Breaking News

దుబాయ్‌లో భారతీయ బిలియనీర్‌కు జైలు శిక్ష

Published on Tue, 05/06/2025 - 14:44

దుబాయ్‌లో నివసిస్తూ.. విలాసవంతమైన జీవితం గడుపుతున్న భారతీయ బిలియనీర్ 'బల్వీందర్ సింగ్ సాహ్ని'కి మనీలాండరింగ్ కేసులో 5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ అక్కడి కోర్టు ఆదేశించింది. ఈ శిక్షా కాలం పూర్తయిన తరువాత దేశాన్ని వదిలిపోవాలని సాహ్నిని దుబాయ్ కోర్టు ఆదేశించినట్లు స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.

షెల్ కంపెనీల నెట్‌వర్క్ ద్వారా 150 మిలియన్ దిర్హామ్‌లను లాండరింగ్ చేయడం, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు పాల్పడినందుకు బల్వీందర్ సింగ్ సాహ్ని శిక్ష.. జరిమానా విధించడం జరిగింది. అంతే కాకుండా ఈ వ్యాపారవేత్త నుంచి 5,00,000 AED (రూ. 1.14 కోట్లు) తో పాటు 150 మిలియన్ AED (రూ. 344 కోట్లు) జప్తు చేయాలని కోర్టు ఆదేశించిందని గల్ఫ్ న్యూస్ నివేదించింది.

'అబు సబా' గా ప్రసిద్ధి చెందిన బల్వీందర్ సింగ్ సాహ్ని.. రాజ్ సాహ్ని గ్రూప్ (RSG) ఫౌండర్. ఈ కంపెనీ యూఏఈలో మాత్రమే కాకుండా.. అమెరికా, ఇండియాతో సహా అనేక దేశాల్లో విస్తరించి ఉంది. విలాసవంతమైన జీవితం గడిపే సాహ్ని.. ఎమిరేట్స్‌లో అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌లలో ఒకటైన 'డీ5' కోసం సుమారు రూ. 75 కోట్ల ఖర్చు చేశారు.

ఇదీ చదవండి: పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలు

కార్ల ధరల కంటే కూడా.. ఆ కార్ల కోసం కొనుగోలు చేసిన నెంబర్స్ ధరలే ఎక్కువని సాహ్ని.. ఓ సందర్భాల్లో చెప్పారు. ఈయన వద్ద అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. మనీలాండరింగ్ కేసులో సాహ్నితో పాటు.. అతని కొడుకుతో కలిపి మరో 32 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కొందరు తప్పించుకుని తిరుగుతున్నట్లు సమాచారం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)