Breaking News

ఈయూతో ఒప్పందంపై దూకుడు పెంచాలి

Published on Sun, 08/10/2025 - 05:57

న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌ల మోత నేపథ్యంలో యూరోపియన్‌ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవడంపై భారత్‌ దూకుడు పెంచాలని 16 ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగారియా చెప్పారు. అదే సమయంలో అధిక వృద్ధి సాధించే దిశగా భూ, కార్మిక మార్కెట్‌ సంస్కరణలను వేగవంతం చేయడంతో పాటు నియంత్రణల భారాన్ని తగ్గించడంపై మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు. ‘ఒక మార్కెట్‌ దాదాపు మూసుకుంటున్నప్పుడు మరో మార్కెట్‌ వైపు మళ్లాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈయూతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా, చాలా ముఖ్యం.

 అదే సమయంలో భూ, కారి్మక మార్కెట్‌కి సంబంధించి సంస్కరణలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది‘ అని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పనగారియా చెప్పారు. ‘మనపై టారిఫ్‌లు అమెరికా మార్కెట్లో ఎక్కువగా ఉండి యూరోపియన్‌ యూనియన్‌లో తక్కువగా ఉంటే.. మన ఎగుమతులను అమెరికా నుంచి ఈయూకి మళ్లించాలి. మార్కెట్లలో లాభాపేక్ష చాలా బలంగా ఉంటుంది. ఎంట్రప్రెన్యూర్లు చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తారు. చాలా వేగంగా సరఫరా వ్యవస్థల్లో మార్పులకు అనుగుణంగా సర్దుకుంటారు‘ అని చెప్పారు.  

‘ప్రస్తుత పరిస్థితి ఒక రకంగా 1991 నాటి పరిస్థితులను తలపిస్తోంది. అమెరికా భారీ టారిఫ్‌ల వల్ల సంక్షోభ పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో అప్పట్లో మనం ఏం చేశామనేది ఒకసారి గుర్తు చేసుకుని, ఏం చేయగలమనేది ఆలోచించాలి. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సంస్కరణల అజెండాలో చాలా చేశాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి‘ అని సంపన్న దేశంగా ఎదగాలంటే భారత్‌ తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మరిన్ని వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని, ఎగుమతుల కోసం ఆసియా మార్కెట్లపై ఫోకస్‌ చేయాలని, అలాగే చైనాపై మన వైఖరిని కూడా పునఃసమీక్షించుకోవాలని పనగారియా సూచించారు.

డెడ్‌ ఎకానమీ .. అత్యధిక వృద్ధి.. 
భారత ఆర్థిక వ్యవస్థ డెడ్‌ ఎకానమీ (నిరీ్వర్యంగా) అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై పనగారియా స్పందించారు. ’భారత ఎకానమీ నిజంగా నిరీ్వర్యమైపోతే.. 7 శాతం స్థాయిలో అత్యధిక వృద్ధి సాధించదు. డాలర్ల మారకంలో చూస్తే మన వృద్ధి బహుశా ఇంకా ఎక్కువే ఉంటుంది. డెడ్‌ ఎకానమీకి ఆయన నిర్వచనం ఏమిటో నాకు తెలియదు. బహుశా (ఆయన ఉద్దేశం ప్రకారం) మృత దేహాల్లోనూ కదలిక ఉంటుందేమో’ అని వ్యాఖ్యానించారు.   
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)