Breaking News

ల్యాండ్‌ డీల్స్‌ జోరు.. టాప్‌లో హైదరాబాద్

Published on Fri, 10/25/2024 - 07:40

న్యూఢిల్లీ: భారత రియల్‌ ఎస్టేట్‌ రంగంలో భూముల క్రయవిక్రయాలు ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్‌లో భారీగా పెరిగాయి. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సీబీఆర్‌ఈ ప్రకారం.. 100 కంటే ఎక్కువ భూ ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల్లో భాగంగా సుమారు 1,700 ఎకరాలు చేతులు మారాయి. గతేడాది ఇదే కాలంలో 60 డీల్స్‌కుగాను 1,200 ఎకరాలు చేతులు మారాయి.

డీల్స్‌ సంఖ్య పరంగా ఈ ఏడాది 65 శాతం వృద్ధి నమోదైంది. ల్యాండ్‌ డీల్స్‌లో ఆరు ప్రధాన భారతీయ నగరాలు ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పుణే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ ఏడాది జరిగిన ల్యాండ్‌ డీల్స్‌లో రెసిడెన్షియల్‌ 61 శాతం, ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్‌ 13 శాతం, ఆఫీస్‌ విభాగం 8 శాతం నమోదయ్యాయి. విభిన్న రకాల ఆస్తులకు సంబంధించి పెరిగిన భూ ఒప్పంద కార్యకలాపాలు బలమైన పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను, భారతీయ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ అభివృద్ధి చెందుతున్న తీరుతెన్నులను ప్రతిబింబిస్తున్నట్లు సీబీఆర్‌ఈ తెలియజేసింది.

ఇదీ చదవండి: ఆఫీస్‌ స్పేస్‌కు భలే గిరాకీ.. భారీగా పెరిగిన లీజింగ్‌

‘‘రెసిడెన్షియల్, ఆఫీస్, డేటా సెంటర్ల వంటి అభివృద్ధి చెందుతున్న విభాగాలలో బలమైన వృద్ధిని చూస్తున్నాం. భారత రియల్‌ ఎస్టేట్‌ రంగం యొక్క దీర్ఘకాలిక అవకాశాలపై పెట్టుబడిదారులు మరింత నమ్మకంగా ఉన్నారనడానికి ఇది నిదర్శనం. ఈ ఆశావాదం భారత్‌ను రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులకు వ్యూహాత్మక మార్కెట్‌గా నిలుపుతోంది. వివిధ మార్కెట్లలో బలమైన డిమాండ్, అనుకూల ఆర్థిక పరిస్థితులతో కలిపి వృద్ధికి అనుకూల వాతావరణాన్ని సృష్టించింది. మార్కెట్‌ స్థిరత్వం, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను నొక్కి చెప్పే వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా ఈ ఊపు కొనసాగుతుందని ఆశిస్తున్నాం’’ అని సీబీఆర్‌ఈ వివరించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)