Breaking News

వేగం పెంచిన ఇండియా.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో ఇలా..

Published on Tue, 10/03/2023 - 08:51

భారతదేశం టెక్నాలజీ వైపు వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో 5జీ సేవలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఫలితంగా డౌన్‌లోడ్ స్పీడ్ మరింత పెరుగుతోంది. దీంతో ఇండియా గొప్ప పురోగతిని చూపించి తాజాగా మంచి ర్యాంక్ సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

స్పీడ్ టెస్ట్ గ్లోబల్ సూచీలో ఇండియా ప్రస్తుతం 47వ స్థానం పొందినట్లు ఊక్లా (Ookla) నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇండోనేషియా, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ వంటి పొరుగు దేశాలకంటే భారత్ ఈ జాబితాలో ముందు వరుసలో నిలిచింది. కొన్ని G20 దేశాలైన మెక్సికో (90వ స్థానం), టర్కీ (68వ), యూకే (62వ), జపాన్ (58వ), బ్రెజిల్ ( 50వ స్థానం), దక్షిణాఫ్రికా (48వ స్థానం) కూడా ఇండియా కంటే వెనుకబడి ఉన్నట్లు ఊక్లా ఎంటర్‌ప్రైజ్ ప్రిన్సిపల్ ఇండస్ట్రీ అనలిస్ట్ సిల్వియా కెచిచే తెలిపారు.

5జీ సర్వీస్ ప్రారంభమైన తరువాత దేశంలో ఇంటర్నెట్ వేగం దాదాపు 3.59 రేట్లు పెరిగింది. సెప్టెంబర్ 2022లో డౌన్‌లోడ్ స్పీడ్ 13.87 Mbpsగా ఉండేది. కాగా 2023 ఆగష్టులో డౌన్‌లోడ్ స్పీడ్ 50.21 Mbpsకి చేరింది. ఈ కారణంగానే గ్లోబల్ ర్యాంకింగ్‌లో 119 స్థానాల నుంచి 47వ స్థానానికి చేరింది.

ఇప్పటికే చాలా సర్వీసులు 4జీ నుంచి 5జీకి అప్డేట్ అవుతున్నాయి. 2003లో మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన చివరి రాష్ట్రాలలో జమ్మూ & కాశ్మీర్ ఒకటి. ఇక్కడ భద్రతా సమస్యలు, ఇంటర్నెట్ షట్‌డౌన్‌ల కారణంగా.. మొబైల్ నెట్‌వర్క్ సేవల్లో అప్పుడప్పుడు అంతరాయాలు ఏర్పడేవి. నేడు అక్కడ కూడా పరిస్థితి ఓ కొలిక్కి వచ్చింది.

ఇదీ చదవండి: ఒక్క నెయిల్ పాలిష్ ఇన్ని కోట్లా..!! ఆ డబ్బుతో మూడు బెంజ్ కార్లు కొనేయొచ్చు!

ఇంటర్నెట్ వేగాన్ని మరింత పెంచడానికి.. ఎయిర్‌టెల్ 'Airtel Xstream AirFiber'ని ఢిల్లీ, ముంబైలలో ఆగస్ట్ 2023లో ప్రారంభించింది. కాగా ఇప్పుడు జియో ఇటీవల ఎయిర్ ఫైబర్ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సర్వీస్ అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పూణే ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో ఈ సర్వీస్ మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశం ఉంది.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)