Breaking News

మెటాకు కీలక మార్కెట్‌గా భారత్‌ 

Published on Wed, 09/06/2023 - 07:44

న్యూఢిల్లీ: స్థూలఆర్థిక వృద్ధి, డిజిటల్‌ మౌలిక సదుపాయాలు తదితర అంశాల్లో భారత్‌లో అపరిమిత అవకాశాలు ఉన్నాయని సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ ఇండియా హెడ్‌ సంధ్య దేవనాథన్‌ చెప్పారు. వీటితో పాటు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి తమ యాప్స్‌ గణనీయంగా ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో భారత్‌ను తాము కీలక మార్కెట్‌గా పరిగణిస్తున్నామని ఆమె వివరించారు.

కేంద్రం కొత్తగా రూపొందించిన డిజిటల్‌ వ్యక్తిగత డేటా భద్రత చట్టంతో ఇటు యూజర్ల వివరాల గోప్యతను పాటించడం, అటు నూతన ఆవిష్కరణలు చేయడం మధ్య సమతౌల్యం పాటించడానికి సంబంధించి టెక్‌ కంపెనీలకు స్పష్టత లభించిందని సంధ్య తెలిపారు. తమ ప్లాట్‌ఫామ్‌పై తప్పుడు సమాచారాన్ని, విద్వేషపూరిత కంటెంట్‌ని క్రియాశీలకంగా కట్టడి చేసేందుకు కృత్రిమ మేధను తాము సమర్థంగా వినియోగించుకునేందుకు కృషి చేస్తున్నామని ఆమె చెప్పారు.  

పెరుగుతున్న యూజర్లు.. 
కీలక మార్కెట్లలో టీనేజర్లు, యువతలో ఫేస్‌బుక్‌కు ఆదరణ తగ్గుతోందన్న అభిప్రాయం సరికాదని.. మెటాలో భాగమైన ఫేస్‌బుక్‌కు భారత్‌లో 40 కోట్ల మంది పైగా యూజర్లు ఉన్నారని వివరించారు. భారత్‌లో తాము వివిధ నవకల్పనలను పరీక్షించి, అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. 2030 నాటికల్లా 1 లక్ష కోట్ల డాలర్ల డిజిటల్‌ ఎకానమీగా ఎదగాలన్న భారత్‌ విజన్‌ అనేది వ్యాపారాలకు గణనీయంగా ఊతమివ్వగలదని సంధ్య చెప్పారు.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)