Breaking News

2000 కంటైనర్లలో రొయ్యలు.. ఎక్కడకు వెళ్తున్నాయంటే..

Published on Mon, 04/14/2025 - 14:46

అమెరికాకు రొయ్యలు సరఫరా చేసేందుకు భారత సీఫుడ్ ఎగుమతిదారులు సిద్ధమవుతున్నారు. అమెరికా ప్రతీకార సుంకాల విధింపునకు బ్రేక్ పడడమే ఇందుకు కారణమని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. టారిఫ్‌లను 90 రోజులపాటు నిలిపేస్తున్నట్ల ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం ఎగుమతిదారులకు ఉపశమనం కలిగించినట్లయింది. దాంతో సుమారు రెండు వేల కంటైనర్ల రొయ్యలు ఎగుమతికి సిద్ధంగా ఉన్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన పరస్పర సుంకాలను కొంతకాలంపాటు నిలిపేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. భారత్‌పై విధించిన 26 శాతం పరస్పర సుంకాన్ని నిలిపివేసి గతంలో ఉన్న 10 శాతాన్ని అమలు చేస్తుండడంతో ఎగుమతులు ఊపందుకున్నాయి. ప్రధానంగా భారత సీఫుడ్ ఎగుమతిదారులు 35,000-40,000 టన్నుల రొయ్యలను అమెరికాకు ఎగుమతి చేయడానికి సిద్ధమవుతున్నారని పరిశ్రమ అధికారులు సోమవారం తెలిపారు. సుంకాల భయాలతో నిలిపివేసిన ఎగుమతులను ప్రాసెస్ చేస్తున్నట్లు సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ కేఎన్ రాఘవన్ తెలిపారు. సుమారు 2,000 కంటైనర్ల రొయ్యలు ఇప్పుడు ఎగుమతికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

ఇదీ చదవండి: సుంకాల యుద్ధంలో విజేతలుండరు

అమెరికా దాటికి 145 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్న చైనా మినహా అన్ని దేశాలపై ప్రతీకార టారిఫ్‌లను తాత్కాలికంగా నిలిపేశారు. దాంతో భారత్‌పై 10 శాతం సుంకాలు అమలవుతుండడంతో ప్రస్తుతం ఎగమతులు ఊపందుకున్నాయి. అమెరికాకు భారత రొయ్యల ఎగుమతులపై 17.7 శాతం కస్టమ్స్ సుంకం ఉండగా, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ 5.7 శాతం, యాంటీ డంపింగ్ డ్యూటీ 1.8 శాతంగా ఉంది. పరిమాణం, విలువ రెండింటిలోనూ యూఎస్‌కు భారతదేశం అతిపెద్ద రొయ్యల మార్కెట్‌గా ఉంది. సుంకాల భయాలున్నా ఆర్డర్లు తగ్గలేదని అసోసియేషన్ తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 2.7 బిలియన్ డాలర్ల విలువైన రొయ్యలను అమెరికాకు ఎగుమతి చేసింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)