ప్రపంచ ఏఐని శాసించేది మనమే.. అన్ని అవకాశాలూ మనకే..

Published on Fri, 08/08/2025 - 18:27

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) విస్తృతి అంతటా పెరిగిపోయింది. అన్ని రంగాలను, పరిశ్రమలను ఈ సరికొత్త సాంకేతికత కమ్మేస్తోంది. దీంతో ఉద్యోగాలు, పని చేసే విధానం పూర్తిగా మారబోతున్నాయి. ఈ నేపథ్యంలో 16వ ఫిక్కీ గ్లోబల్ స్కిల్స్ సమ్మిట్ 2025లో ఫిక్కీ, కేపీఎంజీలు 'నెక్ట్స్ జనరేషన్ స్కిల్స్ ఫర్‌ ఎ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌: ఎనేబుల్ యూత్ అండ్ ఎంపవర్ ఎకానమీ' పేరుతో ఓ కీలక నివేదికను ఆవిష్కరించాయి.

కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి విడుదల చేసిన ఈ నివేదిక గ్లోబల్ ఏఐ టాలెంట్ హబ్ గా మారడానికి భారతదేశ రోడ్ మ్యాప్ ను వివరిస్తుంది.ప్రాంప్ట్ ఇంజినీర్లు, స్మార్ట్ గ్రిడ్ అనలిస్టులు వంటి సరికొత్త భవిష్యత్‌ ఉద్యోగాలతో ఐటీ, హెల్త్ కేర్, ఫైనాన్స్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో వేగవంతమైన కృత్రిమ మేధ ఆధారిత పరివర్తనను కీలక పరిశోధనలు హైలైట్ చేస్తున్నాయి. అయితే భారతీయ యువతలో కేవలం 26.1% మంది మాత్రమే సరైన వృత్తి శిక్షణను పొందుతున్నారు. ఇది అత్యవసర నైపుణ్య అంతరాలను తెలియజేస్తోంది.

రంగాల వారీగా ఏఐ శిక్షణ, ఐటీఐలను ఆధునీకరించడం, టైర్ 2, 3 నగరాల్లో స్థానిక అవసరాలకు తగ్గట్లు నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని నివేదిక సిఫార్సు చేసింది. అట్టడుగు వర్గాల సాధికారత కోసం గ్లోబల్ సర్టిఫికేషన్ అలైన్ మెంట్, నైతిక ఏఐ ప్రమాణాలు, సమ్మిళిత విధానాలు అవసరమని పేర్కొంది.

కలిసొచ్చే అంశాలు    
భారతదేశంలో ఎక్కువగా ఉన్న యువ జనాభా, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్ ఎకోసిస్టమ్‌ మనం ఏఐ వర్క్‌ఫోర్స్‌లో నిర్ణయాత్మకమైన శక్తిగా ఎదగడానికి సానుకూల అంశాలుగా కేపీఎంజీకి చెందిన నిపుణులు పేర్కొన్నారు. వ్యూహాత్మక పెట్టుబడులు, సాహసోపేతమైన సంస్కరణలతో, భారత్‌ ఏఐ నిపుణులను బయటి దేశాలకు అందించగలదని అభిప్రాయపడ్డారు.

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)