Breaking News

ఆరోగ్య వనరుల అడ్డాగా భారత్‌ - ప్రపంచ అవసరాలను కూడా..

Published on Fri, 04/28/2023 - 08:15

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్‌ మెడికల్‌ డివైజెస్‌ పాలసీ, 2023 భారత్‌ను సమగ్ర ఆరోగ్య సంరక్షణ వనరుల కేంద్రంగా మారుస్తుందని పరిశ్రమ భావిస్తోంది. భారత్‌ అవసరాలు తీర్చడమే కాకుండా ప్రపంచానికి కావాల్సిన వనరులను అందించే స్థాయికి ఎదుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ప్రస్తుతం మన దేశ వైద్య అవసరాలకు కావాల్సిన పరికరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో దేశీయంగా వీటి తయారిని ప్రోత్సహించేందుకు, ప్రస్తుతం 11 బిలియన్‌ డాలర్లుగా ఉన్న పరిశ్రమను 50 బిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లే లక్ష్యంతో బుధవారం కేంద్ర ప్రభుత్వం ఈ రంగానికి ప్రత్యేక విధానాన్ని తీసుకువచ్చింది. 

సమగ్ర విధానం..
అసోచామ్‌ ప్రెసిడెంట్‌ అజయ్‌ సింగ్‌ దీనిపై స్పందిస్తూ.. వివిధ రకాల లైసెన్స్‌ల జారీకి సింగిల్‌ విండో, స్థిరమైన ధరల నిబంధనలు, తయారీకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ పరంగా పురోగతి సాధించడం నూతన విధాన లక్ష్యాలుగా ఉన్నట్టు చెప్పారు.

భారత్‌ ఇప్పటికే ప్రపంచానికి ఫార్మసీ కేంద్రంగా ఉండగా, వైద్య ఉపకరణాల విషయంలోనూ సమ ప్రాధాన్యం అవసరమని అభిప్రాయపడ్డారు. ‘‘నూతన పాలసీని విస్తృతమైన సంప్రదింపుల తర్వాత తీసుకొచ్చారు. మన దేశ అవసరాల కోసమే కాకుండా ప్రపంచ అవసరాలు తీర్చే విధంగా భారత్‌ను మార్చాలనే లక్ష్యం ఇందులో ఉంది’’అని అజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు.  

ఆర్‌అండ్‌డీకి ప్రోత్సాహం 
‘‘పరిశోధన అభివృద్ధిపై (ఆర్‌అండ్‌డీ)పై దృష్టి పెట్టడం ప్రోత్సాహనీయం. ప్రపంచ వైద్య ఉపకరణాల మార్కెట్‌లో భారత్‌ కేవలం 1.5 శాతం వాటా కలిగి ఉండగా, మెడికల్‌ టెక్నాలజీ ఆర్‌అండ్‌డీలో 8 శాతం వాటా మన దేశం సొంతం’’అని మెడికల్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ పవన్‌ చౌదరీ పేర్కొన్నారు.

ఆరోగ్య రంగ నిపుణులకు నైపుణ్యాలు, అదనపు నైపుణ్యాలపై శిక్షణ ద్వారా రోగుల సంరక్షణ అవసరాలు తీర్చడంతోపాటు, మానవ వనరుల ఎగుమతులకు తోడ్పడుతుందన్నారు. మారుతున్న రోగుల అవసరాలకు అనుగుణంగా వైద్య ఉపకరణాల రంగంలో వృద్ధిని వేగవంతం చేయడాన్ని ప్రభుత్వ నూతన విధానం లక్ష్యంగా చేసుకున్నట్టు పీహెచ్‌డీసీసీఐ మెడికల్‌ డివైజ్‌ కమిటీ సహ చైర్మన్‌ భార్గవ్‌ కొటాడియా పేర్కొన్నారు.

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు