Breaking News

అమెరికాకు ఎగుమతుల్లో30 శాతం కోత!

Published on Tue, 08/05/2025 - 05:31

న్యూఢిల్లీ: భారత్‌పై 25 శాతం టారిఫ్‌లు విధించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) అమెరికాకు ఎగుమతులు 30 శాతం తగ్గి 60.6 బిలియన్‌ డాలర్లుగా (రూ.5.27 లక్షల కోట్లు) ఉండొచ్చని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనీషియేటివ్‌ (జీటీఆర్‌ఐ) అంచనా వేసింది. 2024–25లో అమెరికాకు ఎగుమతులు 86.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంటరెస్ట్‌ ఈక్వలైజేషన్‌ స్కీమ్‌ (తక్కువ వడ్డీపై రుణ సాయం)ను పునరుద్దరించాలని ప్రభుత్వానికి సూచించింది. 

అలాగే, హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేసి, వాణిజ్య ఒప్పందాలను వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవడం, కొత్త ఎగుమతిదారులను నమోదు చేయించాలని పేర్కొంది. ఆసియాలో పోటీ ఎగుమతిదేశాలైన వియత్నాంపై 20%, బంగ్లాదేశ్‌పై 18%, ఇండోనేíÙయా, మలేషియా, ఫిలిప్పీన్స్‌పై 19%, దక్షిణ కొరియాపై 15% చొప్పున అమెరికా సుంకాలు విధించడం గమనార్హం. కనుక ఈ దేశాలతో పోటీపడడం భారత ఎగుమతిదారులకు కష్టమవుతుందని జీటీఆర్‌ఐ తెలిపింది. అమెరికా టారిఫ్‌ల నుంచి ఫార్మాస్యూటికల్స్, ఇంధన ఉత్పత్తులు, కీలక ఖనిజాలు, సెమీకండక్టర్లకు మినహాయింపు ఉంది. కనుక ఇతర ఎగుమతులకు ఒత్తిళ్లు ఎదురవుతాయని పేర్కొంది.    

గార్మెంట్స్, రత్నాభరణాల పరిశ్రమలకు ఇబ్బందులు 
గార్మెంట్స్‌ (వ్రస్తాలు) తయారీదారులపై ఎక్కువ ప్రభావం ఉంటుందని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్‌ శ్రీవాస్తవ తెలిపారు. అల్లిన, నేత వస్త్రాలపై వరుసగా 38.9%, 35.3% చొప్పున టారిఫ్‌లు ఎదుర్కోవాల్సి వస్తుందని.. దీంతో వీటికి సంబంధించి 2.7 బిలియన్‌ డాలర్ల ఎగుమతులకు ఆటంకాలు ఎదురవుతాయన్నారు. టవల్స్, బెడ్‌ïÙట్‌లు వంటి 3 బిలియన్‌ డాలర్ల టెక్స్‌టైల్స్‌ ఎగుమతులు 34% టారిఫ్‌లను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. 

పాకిస్తాన్, వియత్నాం కంపెనీలకు ఈ విభాగంలో ప్రయోజనం లభిస్తుందన్నారు. అమెరికాకు ఎగుమతి అయ్యే 2 బిలియన్‌ డాలర్ల రొయ్యల ఎగుమతులపైనా ప్రభావం పడుతుందని చెప్పారు. 10 బిలియన్‌ డాలర్ల రత్నాభరణాలు 27% టారిఫ్‌లు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ‘ఇంటరెస్ట్‌ ఈక్వలైజేషన్‌ స్కీమ్‌ను గతేడాది నిలిపివేశారు. రూ.15,000 కోట్ల వార్షిక బడ్జెట్‌తో దీన్ని తిరిగి ప్రారంభించాలని జీటీఆర్‌ఐ సూచించింది. ఐదేళ్ల పాటు సబ్సిడీపై రుణాన్ని ఎగుమతిదారులకు, ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలకు అందించాలి. దీనివల్ల రుణ వ్యయాలు తగ్గి ఎగుమతిదారుల పోటీతత్వం పెరుగుతుంది’అని శ్రీవాస్తవ వివరించారు.  

రంగంలోకి దిగిన ప్రభుత్వం 
అమెరికా టారిఫ్‌ల ప్రభావాన్ని ఎక్కువగా ఎదుర్కొనే టెక్స్‌టైల్స్, కెమికల్స్‌ తదితర రంగాలకు చెందిన ఎగుమతిదారులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు ఓ అధికారి తెలిపారు. స్టీల్, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఇంజనీరింగ్, మెరైన్, వ్యవసాయం తదితర రంగాలకు చెందిన ఎగుమతిదారులతో వాణిజ్య శాఖ సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. ఆర్థిక సాయంతోపాటు చౌక రేట్లపై రుణ సాయాన్ని సమకూర్చాలని  ఎగుమతిదారులు ప్రభుత్వాన్ని కోరారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)