Breaking News

అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు

Published on Wed, 09/03/2025 - 08:09

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) అమెరికాతో ఇంకా చర్చలు జరుగుతున్నట్లు కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ తెలిపారు. అలాగే చైనాతో కూడా సంబంధాలు తిరిగి సాధారణ స్థాయి దిశగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. సరిహద్దు సమస్యలు పరిష్కారమయ్యే కొద్దీ, సహజంగానే ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయని పరిశ్రమల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, యూఏఈ, మారిషస్, బ్రిటన్, ఈఎఫ్‌టీఏతో (యూరప్‌లోని నాలుగు దేశాల కూటమి) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి చెప్పారు.  

భారత్‌ మా వెంటే...: బెసెంట్‌

అగ్రరాజ్యం మన ఎగుమతులపై భారీగా సుంకాలు ప్రకటించిన నేపథ్యంలో అమెరికా–భారత్‌ల మధ్య మార్చి నుంచి ఇప్పటివరకు అయిదు విడతలు చర్చలు జరిగాయి. ఆరో విడత సంప్రదింపుల కోసం ఆగస్టు 25న అమెరికా బృందం భారత్‌ రావాల్సి ఉన్నప్పటికీ, ఆగస్టు 27 నుంచి సుంకాలను 50 శాతానికి పెంచేయడంతో, ఆ పర్యటన రద్దైంది. తదుపరి విడత చర్చలకు ఇంకా తేదీలు ఖరారు కాలేదు. 

మరోవైపు, ఏది ఏమైనప్పటికీ భారత్‌ తమ వెంటే ఉంటుందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ ధీమా వ్యక్తం చేశారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ పాటించే విలువలు రష్యా కన్నా అమెరికా, చైనాకి చాలా దగ్గరగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. గొప్ప దేశాలైన భారత్, అమెరికా ఈ వివాదాన్ని (సుంకాలు) పరిష్కరించుకుంటాయని బెసెంట్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: టాటా క్యాపిటల్‌ రోడ్‌షోలు షురూ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)