Breaking News

అమెరికాతో భాగస్వామ్యానికి భారత్‌ సిద్ధం

Published on Fri, 04/18/2025 - 14:13

సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల్లో అమెరికాతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు భారత్‌ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. టెస్లా సీఈఓ ఎలాన్‌మస్క్‌తో ఈ ఏడాది ప్రారంభంలో వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించినట్లు మోదీ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. 

ప్రధానంగా టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో భారత్-అమెరికాల మధ్య సహకారానికి అపారమైన అవకాశాలున్నాయని మోదీ తన పోస్టులో నొక్కిచెప్పారు. ఈ రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు.  భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న కీలక సమయంలో ఈ పోస్టు చేయడం గమనార్హం.

టెస్లా త్వరలో భారత మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి కంపెనీ ఇక్కడ కార్యకలాపాలు సాగించేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈమేరకు ముంబయిలో ఉద్యోగుల నియామకాలు, షోరూమ్‌ కోసం స్థల పరిశీలన చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదీ చదవండి: రూ.10 వేలలోపు టాప్‌ 10 మొబైళ్లు

మస్క్‌కు చెందిన శాటిలైట్‌ కమ్యునికేషన్‌ సిస్టమ్‌ స్టార్‌లింక్‌ కూడా భారత్‌లోకి ప్రవేశించనుంది. స్థానికంగా ఉన్న రిలయన్స్‌, ఎయిర్‌టెల్‌ వంటి టెలికాం కంపెనీలు ముందుగా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించినా తర్వాత ఆ కంపెనీతోనే భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)