Breaking News

ఐదు పెద్ద ఆర్థిక వ్యవస్థల వృద్ధిలో మనమే టాప్‌!

Published on Fri, 08/25/2023 - 04:08

న్యూఢిల్లీ: భవిష్యత్‌లో ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల (అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, భారత్‌) వృద్ధి స్పీడ్‌లో భారత తొలి దేశంగా ఉంటుందని ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్‌ ఉద్ఘాటించారు. భారత్‌ పురోగతిలో ప్రవాస భారతీయులను ఒక ఉ్రత్పేరకం వలె పని చేయాలని,  భారతదేశాన్ని అతిపెద్ద అవకాశంగా మార్చడంలో ప్రభుత్వ ప్రయత్నాలకు అనుబంధంగా ఉండాలని కోరారు.

  రేటింగ్‌ దిగ్గజం– ఎస్‌అండ్‌పీ  గ్లోబల్‌ నివేదిక భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం  3.4 ట్రిలియన్‌ డాలర్ల 2031 నాటికి రెట్టింపై 6.7 ట్రిలియన్ల డాలర్లకు రెట్టింపు అవుతుందని పేర్కొన్న ఇటీవలి నివేదికను సోమనాథన్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. జనాభా ప్రకారం ఇది అతిపెద్ద దేశం. ఏ ప్రాతిపదికన చూసినా,  భారతదేశ వృద్ధి రేటు మొదటి నాలుగు దేశాల కంటే చాలా వేగంగా ఉంది.

ఈ నాలుగు దేశాలూ భారతదేశం కంటే తక్కువ వృద్ధి రేటునే కలిగి ఉంటాయని మనం బల్లగుద్దిమరీ చెప్పగలం’’ అని ఆయన ఒక ప్రసంగంలో పేర్కొన్నారు. అవకాశాల పరిమాణం పరంగా చూస్తే, భారతదేశం భవిష్యత్తులో అతిపెద్ద అభివృద్ధి అవకాశంగా నిస్సందేహంగా కొనసాగుతుందని  చెప్పవచ్చని ఇండియాస్పోరా జీ20 ఫోరమ్‌లో సోమనాథన్‌ అన్నారు. 2022–23లో 7.2 శాతంగా ఉన్న భారత్‌ వృద్ధి రేటు 2023–24 మధ్య 6 నుంచి 6.5 శాతం శ్రేణిలో ఉండే అవకాశం ఉందని వివిధ సంస్థలు అంచనావేస్తున్నాయి.
 
రాబోయే సంవత్సరాల్లో దాతృత్వం కంటే పెట్టుబడి చాలా ముఖ్యమైనది కావచ్చు.  పెట్టుబడి కంటే సాంకేతికత బదిలీ కీలకం కావచ్చు. డబ్బు కంటే మీ జ్ఞానం ముఖ్యమైనది కావచ్చు.
– ఇండియాస్పోరా జీ20 ఫోరమ్‌లో ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్‌

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)