Breaking News

సాగుకు ముందస్తు భరోసా

Published on Sat, 03/21/2026 - 11:22

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు దెబ్బతింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలిచేందుకు రంగంలోకి దిగింది. రానున్న ఖరీఫ్-2026 సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఎరువుల కొరత రాకుండా ఉండేందుకు దేశీయ ఉత్పత్తిని పెంచడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దిగుమతులను వేగవంతం చేస్తూ బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది.

యూరియా ఉత్పత్తికి ప్రాధాన్యత

దేశీయంగా యూరియా ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం గ్యాస్ సరఫరాలో కీలక మార్పులు చేసింది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) కొరత కారణంగా పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయలేకపోతున్న ప్లాంట్లకు ఊరటనిస్తూ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది.

ఎల్‌పీజీ(వంటగ్యాస్) అవసరాల తర్వాత గ్యాస్ సరఫరాలో ఎరువుల ప్లాంట్లకు రెండో ప్రాధాన్యత కల్పించారు. స్పాట్ మార్కెట్ నుంచి బిడ్డింగ్ ద్వారా అదనంగా 7.31 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ పర్ డే(ఎంఎంఎస్‌సీఎండీ) గ్యాస్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది. దీనివల్ల ప్లాంట్లకు అందుతున్న గ్యాస్ సరఫరా 32 ఎంఎంఎస్‌సీఎండీ నుంచి 39.31 ఎంఎంఎస్‌సీఎండీకి (23 శాతం) పెరుగుతుంది. అమోనియాను విడిగా విక్రయించవద్దని దాన్ని పూర్తిగా యూరియా తయారీకే ఉపయోగించాలని కంపెనీలకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ప్రస్తుతం ప్లాంట్లకు అవసరమైన గ్యాస్‌లో 62 శాతం మాత్రమే అందుతుండగా కొత్త ఒప్పందంతో అది 76 శాతానికి చేరనుంది. దీనివల్ల దేశీయ యూరియా ఉత్పత్తి రోజుకు 54,500 టన్నుల నుంచి 67,000 టన్నులకు పెరుగుతుందని అంచనా.

ఖరీఫ్ 2026.. అందుబాటులో భారీ నిల్వలు

జూన్ 1న నైరుతి రుతుపవనాల రాకతో ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్ కోసం ఇప్పటికే సరిపడా నిల్వలను సిద్ధం చేసినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం దేశంలో ఎరువుల నిల్వలు మెరుగ్గా ఉన్నాయన్నారు.

మార్చి 19 నాటికి ఎరువుల నిల్వల వివరాలు (లక్షల టన్నుల్లో)

ఎరువు రకంప్రస్తుత నిల్వలు (2026)గతేడాది నిల్వలు (2025)
యూరియా61.1455.22
డీఏపీ24.2411.85
కాంప్లెక్స్57.2134.44
ఎస్‌ఎస్‌పీ24.823.15
ఎంఓపీ12.6514.13

 

వ్యూహాత్మక అడుగులు

యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ రష్యా, బెలారస్, మొరాకో, కెనడా వంటి దేశాలు ఎరువుల సరఫరాకు ముందుకొచ్చాయి. అయితే, ప్రభుత్వం ప్రస్తుతం దేశీయంగా యూరియా ఉత్పత్తిపైనే దృష్టి కేంద్రీకరించింది. రాబోయే 1-2 వారాల్లో అంతర్జాతీయ పరిస్థితులు కుదుటపడితే అవసరానికి అనుగుణంగా దిగుమతులపై తుది నిర్ణయం తీసుకోనుంది.

ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!

Videos

పెద్ది విడుదల మళ్ళీ వాయిదా? వార్తల్లో నిజమెంత?

యువతకు ముష్టి వేస్తున్నారా? జాబ్ క్యాలెండర్ పై జడ శ్రవణ్ రియాక్షన్

హాట్ టాపిక్ కు అడ్డాగా అమెరికా డొనాల్డ్ ట్రంప్ Vs పోప్

ఏపీలో ఈదురుగాలులతో భారీ వర్షాలు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

వలస కూలీలకు గుడ్ న్యూస్ కమర్షియల్ గ్యాస్ పై కేంద్రం కీలక నిర్ణయం

ఆ పేరు ఎత్తలంటేనే సిగ్గుగా ఉంది BR నాయుడుపై శ్యామల ఫైర్

పేర్ని కిట్టు ప్లెక్సీలపై కూటమి నేతల కడుపు మంట

మా భారతమ్మ పై పడి ఏడుస్తారు కదా ఉగాది వేడుకల్లో మరి మీ భార్యలు ఎక్కడ..?

పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారుల అవస్థలు

దాడులను ఖండిస్తూ ఇరాన్ ప్రధానికి మోదీ ఫోన్

Photos

+5

బుజ్జి అభిమానితో భోజనం చేసిన 'విరోష్‌' జోడీ (ఫోటోలు)

+5

డైరెక్టర్‌గా ‘జబర్దస్త్’ కమెడియన్‌..‘కామాఖ్య’ టీజర్‌ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

వేలాది భక్తుల మధ్య కైరుప్పల పిడకల సంబరం (ఫొటోలు)

+5

వాళ్లు అప్పుడు నాకు సూపర్‌స్టార్స్‌.. ఇప్పుడు నేను (ఫొటోలు)

+5

గద్దర్ అవార్డ్ వేడుక కోసం అక్కినేని కోడలు ఇలా (ఫొటోలు)

+5

మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్‌- 2025లో మెరిసిన హీరోయిన్లు (ఫోటోలు)

+5

శ్రీశైలంలో రమణీయంగా రథోత్సవం పులకించిన భక్తులు (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్ అందుకున్న విజేతలు (ఫొటోలు)

+5

అట్టహాసంగా గద్దర్ అవార్డుల వేడుక.. టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)