Breaking News

భారీ సంఖ్యలో టెక్‌ సిబ్బంది అవసరం..

Published on Thu, 08/20/2026 - 18:55

దేశంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఎకోసిస్టమ్‌ వృద్ధికి బడా టెక్‌ సంస్థల ఆధిపత్య ధోరణి కంటే నిపుణుల కొరత, డేటా ప్రామాణీకరణ లోపించడం అనేవి ప్రధాన అవరోధాలుగా నిలుస్తున్నాయని తాజా నివేదికలో వెల్లడైంది. ‘భారతదేశ ఏఐ ఎకోసిస్టమ్‌లో పోటీతత్వం, నవకల్పనలు, మార్కెట్‌ స్వరూపం’ పేరుతో ది డైలాగ్‌ అనే సంస్థ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. దేశంలో ఏఐ రంగం వేగవంతమైన అభివృద్ధి, విస్తరణ దశలో ఉంది, అయితే, తగినంత మంది ప్రతిభావంతులు లేకపోవడం, డేటా వినియోగంలో లోటుపాట్లు కీలక సమస్యలని పేర్కొంది. స్టార్టప్‌లు, బిజినెస్‌ యూజర్లు, వినియోగదారుల్లో 308 మందిని ఈ అధ్యయనంలో భాగంగా సర్వే చేశారు.

ముఖ్యాంశాలివీ...

  • నైపుణ్యగం గల సిబ్బంది లభ్యత భవిష్యత్తు పోటీతత్వానికి ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయని అని సర్వేలో పాల్గొన్న వారిలో 47.2 శాతం గుర్తించారు. అదేవిధంగా కస్టమర్లు ఏఐ సేవలను అందిపుచ్చుకోవడం కూడా అంతే స్థాయిలో కీలక సవాలుగా పేర్కొన్నారు.

  • భారీ సంఖ్యలో టెక్‌ సిబ్బంది అవసరంతో పాటు ఏఐ వ్యవస్థలను రూపొందించడం, శిక్షణ ఇవ్వడం, అమలు చేయడం, దాన్ని విస్తరించడానికి ప్రత్యేక నైపుణ్యలు కావాలని ది డైలాగ్‌ సీనియర్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ భూమిక అగర్వాల్‌ పేర్కొన్నారు.

  • ఏఐ అభివృద్ధిలో డేటా వినియోగం మరో పెద్ద సమస్యగా ఉంది. డేటా కొరత కంటే వినియోగంలో ఒకే విధమైన ప్రమాణాలు లేకపోవడం ప్రధాన ఇబ్బంది అని 63.2 శాతం మంది ఏఐ డెవలపర్లు అభిప్రాయపడ్డారు. కాపీరైట్‌ సమస్యలను 44 శాతం మంది, డేటా కొరతను 42 శాతం మంది సవాలుగా చెప్పారు. ప్రభుత్వ అ«దీనంలోని డేటాసెట్స్‌ సులభంగా అందుబాటులో ఉన్నాయని కేవలం 15 శాతం మంది మాత్రమే పేర్కొనడం గమనార్హం.

  • భారత్‌లోని ఏఐ స్టార్టప్‌లు, డెవలపర్లు ఓపెన్‌ సోర్స్‌ మోడళ్లు, టూల్స్‌పై కొంతమేర ఆధారపడుతున్నట్లు 96.2 శాతం మంది చెప్పారు. 62.3 శాతం మంది వాటిపై అధికంగా ఆధారపడుతున్నామని వెల్లడించారు.

ఇదీ చదవండి: స్టాక్‌మార్కెట్‌లో కొత్త ప్రయత్నం.. ‘డబుల్‌ ట్రేడింగ్‌’!

Videos

ఏపీ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి

Watch Live: హైదరాబాద్ లో జగన్ జనసంద్రం

భారత సైన్యం దెబ్బ.. మంచు కొండల్లో చైనాకు దిమ్మతిరిగే షాక్!

ఇది సార్ మా బ్రాండ్.. రాకాలో హాలీవుడ్ నటుడు..?

ఐయామ్ Gen-Z అంటూ ఆర్మీ పై రెచ్చిపోయిన యువతీ

బాబు కొత్త కుట్రలు.. YS అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు

టీడీపీ కార్యకర్త కీచకత్వం.. 8 ఏళ్ల బాలికకు వేధింపులు

TDP నేతకు బిగ్ షాక్

బాబు ఇంట్లో డైనింగ్ టేబుళ్లు పగిలిపోతాయి... నువ్వు ఎవడివి నాపై CBI వేయడానికి..!

YS అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు..

Photos

+5

‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్‌...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా?

+5

నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు)

+5

‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : హైటెక్స్‌లో హిమ్‌టెక్స్‌ ప్రదర్శన (ఫొటోలు)

+5

స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు)

+5

చీరలో మరింత అందంగా కనిపిస్తున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (ఫొటోలు)

+5

చీరకట్టులో సొగసుల విందు.. నివేదా థామస్ (ఫొటోలు)

+5

విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్‌లో విపరీతమైన రద్దీ (ఫొటోలు)

+5

నటి మాళవిక శర్మ గ్లామర్ ఫోటోలు వైరల్

+5

'అమీర్ లోగ్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)