Breaking News

ఏఐలో ఎందుకో వెనకబడ్డాం!

Published on Sat, 05/02/2026 - 10:52

కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో భారతదేశం అనుసరించాల్సిన వ్యూహంపై దేశీయ టెక్ దిగ్గజాలు, అంతర్జాతీయ నిపుణుల మధ్య ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఏఐ ప్రపంచంలో భారత్ నిర్మాతగా ఎదగాలా లేక వినియోగదారుగానే ఉండిపోవాలా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్‌)కు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ గిరీష్ దిలీప్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు చర్చకు కొత్త మలుపునిచ్చాయి.

ఆలోచనలు పాతబడ్డాయా?

భారతదేశ టెక్ రంగానికి దిక్సూచిగా నిలిచిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని, నారాయణమూర్తిల ఆలోచనా దృక్పథం ప్రస్తుత ఏఐ యుగానికి సరిపోదని గిరీష్ పాటిల్ అభిప్రాయపడ్డారు. నీలేకని వంటి వారు 1990ల నాటి ఐటీ సర్వీసుల మనస్తత్వంతోనే ఆలోచిస్తున్నారని, ఇది 21వ శతాబ్దంలో భారత్‌ను వెనుకబడిపోయేలా చేస్తుందని విమర్శించారు. ఆధార్ వంటి గొప్ప ప్రాజెక్టులకు నీలేకని కృషిని గౌరవిస్తూనే, ‘ప్రస్తుతం దేశానికి నందన్ నీలేకనిలు కాదు, విశాల్ సిక్కా వంటి దూరదృష్టి గల నాయకులు అవసరం’ అని పాటిల్ చేసిన వ్యాఖ్య టెక్ వర్గాల్లో చర్చకు దారితీసింది.

మరోవైపు, నందన్ నీలేకని, మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ చైర్మన్ రవి వెంకటేశన్ ఇటీవల తమ అభిప్రాయాలను వెల్లడించారు. భారత్‌లో భారీ పెట్టుబడులు, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రాథమిక స్థాయి నుంచి ప్రతిదీ నిర్మించడానికి బదులుగా ఇప్పటికే ఉన్న ఏఐ సాంకేతికతను మన అవసరాలకు తగ్గట్టుగా వాడుకోవడం ఉత్తమమని సూచించారు. ఆధార్, యూపీఐ విజయాల తరహాలోనే ఆరోగ్య, వ్యవసాయ, విద్యా రంగాల్లో ఏఐని సమర్థవంతంగా వాడటమే మన ప్రధాన లక్ష్యం కావాలని స్పష్టం చేశారు.

విశాల్ సిక్కా దార్శనికత

విశాల్ సిక్కా ఇన్ఫోసిస్ సీఈఓగా ఉన్న సమయంలో (2014-2017) సంస్థను సర్వీసులందించే కంపెనీ నుంచి ఉత్పత్తులు, ప్లాట్‌ఫారమ్‌ల బేస్డ్‌ సంస్థగా మార్చాలని ప్రయత్నించారు. ఆటోమేషన్, ఏఐ ఆధారిత సేవలపై ఆయన చూపిన శ్రద్ధ అప్పట్లో విప్లవాత్మకం. అయితే, అంతర్గత పాలనాపరమైన వివాదాలు, వ్యవస్థాపకుల నుంచి ఎదురైన విమర్శలతో ఆయన వైదొలగాల్సి వచ్చింది. సిక్కా ఆలోచనలను అప్పుడే అమలు చేసి ఉంటే నేడు ఇన్ఫోసిస్ ఏఐ రంగంలో ప్రపంచ స్థాయిలో ఉండేదని, ఓపెన్ఏఐ వంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టి ఉంటే మార్కెట్ విలువ ఊహించలేనంతగా పెరిగేదని నెటిజన్లు సోషల్ మీడియాలో విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం సిక్కా వహనా ఏఐ సిస్టమ్స్ ద్వారా మానవ కేంద్రీకృత ఏఐపై పనిచేస్తున్నారు.

ఇదీ చదవండి: మరికొద్ది గంటల్లో ఫోన్లకు అలర్ట్‌!

Videos

సీరియల్ ఇండస్ట్రీలో నెపోటిజం చాలా అవమానాలు పడ్డా.. ఒకరోజు నాగార్జున కాల్ చేసి..!

ఒకే కుటుంబం ఆఖరి ప్రయాణం. AI వీడియో..

ప్రాణం తీసిన పాపులారిటీ భార్యపై ఈగోతో కొడవలితో హత్య

మార్కెట్లు కుప్పకూలిన జెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన స్టాక్

నమ్మించి మోసం చేయడం కాంగ్రెస్ నైజం

ట్యూషన్ వెళ్తున్న బాలుడి కిడ్నాప్ తెలివిగా తప్పించుకుని పేరెంట్స్ కి ఫోన్..

దళితులపై రఘురామ వ్యాఖ్యలు ఇచ్చిపడేసిన మందకృష్ణ మాదిగ

ఆందోళన చేస్తున్న మహిళలను ఈడ్చిపడేసిన పోలీసులు

విజయ్ అనే నేను.! ప్రమాణ స్వీకారానికి ప్రాక్టీస్ చేస్తున్న దళపతి

నీకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య నువ్వా మా పార్టీ కోసం మాట్లాడేది

Photos

+5

యాంకర్ రష్మి ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

చరణ్ అతిథిగా మెగా కోడలి సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ సావిత్రి కుమార్తె 21 రోజుల వేడుక (ఫొటోలు)

+5

మిస్ యూనివర్స్ ఇండియా టు హీరోయిన్‌.. ఎవరీ రియా సింఘా? (ఫొటోలు)

+5

తెలంగాణలో గుహ మధ్య అద్భుతమైన ఆలయం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : వైద్య విద్యార్థుల ఆనందం చెట్ట‘పట్టా’ల్‌ (ఫొటోలు)

+5

ఏపీ : పలు జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం (ఫొటోలు)

+5

బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రిసెప్షన్‌: ప్రముఖుల సందడి (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో మ్యాడ్ స్క్వేర్‌ బ్యూటీ రెబా మోనికా జాన్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి మీనా వాసు మ్యారేజ్ డే.. భర్తకు స్పెషల్ విషెస్ (ఫోటోలు)