Breaking News

Budget 2023-24: కొత్త ఇన్‌కం టాక్స్‌పై చిక్కు ప్రశ్నలు, సమాధానాలు

Published on Wed, 02/01/2023 - 19:22

2023-24 బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఇన్‌కంటాక్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రూ.7 లక్షల వరకు పన్ను లేదన్న ప్రకటన ఎంత వరకు మేలు చేస్తుందన్న దానిపై రకరకాల అంచనాలు వేస్తున్నారు నిపుణులు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పినదాని ప్రకారం.. 7లక్షల ఆదాయం వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు, ఆదాయం రూ.7లక్షలు దాటితే మాత్రం 5 శ్లాబుల్లో పన్ను ఉంటుంది.

0-3 లక్షల వరకు నిల్‌
3 - 6 లక్షల వరకు 5% పన్ను
6 - 9 లక్షల వరకు 10% పన్ను
9 -12 లక్షల వరకు 15% పన్ను
12- 15 లక్షల వరకు 20% పన్ను
రూ.15 లక్షల ఆదాయం దాటితే 30% పన్ను

ఇన్‌కంటాక్స్‌లో పాత, కొత్త రెండు టారిఫ్‌/రెజిమే ఆప్షన్లు ఉంటాయా?
ప్రస్తుతం ఆదాయపుపన్నులో రెండు ఆప్షన్లు ఉన్నాయి. పాత పద్ధతిలో టాక్స్‌ అసెస్‌మెంట్‌ చేసుకోవచ్చు లేదా కొత్త పద్ధతిని ఎంచుకోవచ్చు. ఎవరికి దేని వల్ల మేలు జరిగితే దాన్ని ఇప్పటివరకు ఎంచుకున్నారు. బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటించిన కొత్త శ్లాబు విధానం వల్ల అందరికీ డిఫాల్ట్‌గా కొత్త విధానం అమల్లోకి వస్తుంది. అయితే కావాలనుకునే వాళ్లు పాత శ్లాబు సిస్టమ్‌ను కూడా ఎంచుకోవచ్చు.

పాత శ్లాబు సిస్టమ్‌ ఎవరికి మంచిది?
కొత్త పద్ధతిలో రూ.7 లక్షల వరకు టాక్స్‌ మినహాయింపు ఉన్నా.. ఇప్పటికీ కొందరికి పాత పద్ధతి మంచిదంటున్నారు నిపుణులు. సెక్షన్‌ 80సి కింద లక్షన్నర రుపాయలు ఇన్వెస్ట్‌ చేసేవారు, NPS కింద 50 వేల రుపాయలు పెట్టుబడి పెట్టిన వారు, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఖర్చుల కింద రూ.25వేలతో బీమా తీసుకున్నవారు, సేవింగ్స్‌ కింద రూ.4.25 లక్షలు చూపించే వారికి ఇప్పటికీ పాత శ్లాబు సిస్టమే బెటరంటున్నారు. దీని వల్ల రూ.6.75 లక్షల ఆదాయం వరకు ఎలాంటి టాక్స్‌ కట్టనవసరం లేదంటున్నారు.

7 లక్షలు అన్న పరిమితిని ఎలా చూడవచ్చు?
కొత్త శ్లాబు పద్ధతిలో 7 లక్షల పరిమితి ఓ ఛాలెంజింగ్‌ విషయమే. ఉదాహారణకు మీ ఆదాయం రూ.7లక్షల వరకు ఉంటే మీరు లాభపడ్డట్టే. అయితే మీ ఆదాయం అనుకోకుండా రూ.7లక్షల పది వేలు అయిందనుకోండి. మీరు పన్నుల కింద రూ.26వేలు, దాంతో పాటు సర్‌ఛార్జీ, సెస్‌ కట్టాల్సి ఉంటుంది.

15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే ఏది ఎంచుకోవాలి?
ఇప్పటి నుంచి పాత శ్లాబు ఎంచుకుంటే ఏడాదికి 15 లక్షల ఆదాయం పొందుతున్న వారు రూ.82,500 పన్నుగా చెల్లించాలి. కొత్త శ్లాబు ఎంచుకుంటే అదే 15లక్షల ఆదాయానికి రూ.1,50,000 పన్నుగా చెల్లించాల్సి వస్తుంది. 

దీన్ని బట్టి మధ్యతరగతి వేతన జీవులకు మాత్రమే కొత్త బడ్జెట్‌లో మేలు జరిగినట్టుగా భావించాలంటున్నారు ఆర్థిక నిపుణులు.

Videos

జేమ్స్ కామెరాన్ చేతిలో SSMB29 ప్రమోషన్స్

అమెరికాలోని పెంబ్రోక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

అబ్బయ్య చౌదరిని చంపితే? వెయ్యి మంది అబ్బయ్య చౌదరిలు వస్తారు.. పేర్ని నాని సంచలన కామెంట్స్

తమిళనాట విజయ్ వ్యూహం.. ఎలా ఉండబోతోంది?

వాడు తేడా.. అమ్మాయిల పిచ్చి.. ధర్మ మహేష్ భార్య గౌతమి సంచలన కామెంట్స్

TDP నేత సంచలన ఆడియో.. తిరుపతి ఇంచార్జి మంత్రి జల్సాలు.. లాడ్జీల్లో సరసాలు..

మీ చేతికి రెండు కోట్లు.. పరారీలో ఉన్న ఖైదీకి పెరోల్.. అసలు సంగతి ఇదీ

మీ చేతికి రెండు కోట్లు.. పరారీలో ఉన్న ఖైదీకి పెరోల్.. అసలు సంగతి ఇదీ

పీపీపీ ప్రాజెక్టుల పేరిట ప్రజాధనాన్ని దారి మళ్లిస్తోన్న కూటమి సర్కార్

కూకట్ పల్లి బాలిక హత్య కేసులో సంచలన విషయాలు

Photos

+5

జర్మనీ : గుమ్మడికాయల ప్రదర్శన అదరహో (ఫొటోలు)

+5

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఘనంగా వరలక్ష్మీ వత్రాలు (ఫొటోలు)

+5

జపాన్‌లో చిల్ అవుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

పద్మనాభస్వామి ఆలయ వేడుకలో మోహన్ లాల్ (ఫొటోలు)

+5

శ్రీవారితో అందమైన జర్నీకి ఏడాది! వరాహరూపం సింగర్‌ శ్రీలలిత (ఫొటోలు)

+5

'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్‌ గ్లింప్స్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ట్రెండింగ్‌ ఫోటోలు చూశారా..?

+5

#HBDChiranjeevi : 70 ఏళ్ల గాడ్‌ ఫాదర్‌.. 'చిరంజీవి' బర్త్‌డే స్పెషల్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి శ్రియా శరణ్ (ఫొటోలు)

+5

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే.. ఇవి మీకు తెలుసా? (ఫొటోలు)