Breaking News

ఐసీఐసీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్

Published on Thu, 02/23/2023 - 18:43

సాక్షి, ముంబై: దేశీయ దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ తమ కస్టమర్లకు శుభవార్త అందించింది.  ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ)లపై వడ్డీ రేట్లను భారీగా పెంచింది. బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 7.15 శాతం వడ్డీ రేటును చెల్లించ నున్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. డిపాజిట్ల రకాలు,   వ్యవధి ఆధారంగా వడ్డీ రేట్లులో మార్పులుంటాయి.  రూ.2 కోట్లకుపైన రూ.5 కోట్ల  లోపు ఉండే ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను  బ్యాంక్ పెంచింది.

(ఇదీ చదవండి:  సుమారు 5 వేలమంది సీనియర్లకు షాకిచ్చిన ఈ కామర్స్‌ దిగ్గజం)

ప్రస్తుతం 4.75 శాతం నుంచి 7.15 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది ఐసీసీఐ. ఈ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 23 నుంచి వర్తిస్తాయని బ్యాంక్ వెల్లడించింది. సవరించిన వడ్డీ రేట్లు  నేటి (ఫిబ్రవరి 23 )నుంచే అమలులోకి వస్తాయని ఐసీఐసీఐ వెల్లడించింది. రెండు నుంచి  మూడేళ్ల బల్క్‌ డిపాజిట్లపై  7.00  శాతాన్ని అలాగే 290రోజుల నుంచి  రెండేళ్ల వ్యవధిలోని  డిపాజిట్లపై  అ‍త్యధికంగా 7.15 శాతం వడ్డీని అందిస్తుంది.  (నెలకు రూ.4 లక్షలు: రెండేళ...కష్టపడితే, కోటి...కానీ..!)

సవరించిన  బల్క్‌ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు 
♦ 7 - 29 రోజుల వ్యవధి డిపాజిట్లపై  4.75 శాతం
♦ 30 - 45 రోజులకు 5.50 శాతం
♦ 46 - 60 రోజులకు 5.75 శాతం
♦ 61 -90 రోజులకు  6.00 శాతం
♦ 91 -184 రోజులకు 6.50 శాతం
♦ 185 - 270 రోజులు 6.65 శాతం 
♦  3 నుంచి  అయిదేళ్ల  డిపాజిట్లపై 6.75 శాతం 
♦ 5 -10 సంవత్సరాల డిపాజిట్లపై 6.75 శాతం

కాగా ఇటీవల మానిటరీ పాలసీ రివ్యూలో ఆర్‌బీఐ రెపో రేటును పెంచిన సంగతివ తెలిసిందే. దీంతో అన్ని బ్యాంకులు వడ్డీరేట్లను సవరిస్తున్నాయి. ఇప్పటికే  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్  రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీ వడ్డీ రేట్లను పెంచింది.  సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై 3.50 శాతం నుంచి 7.60 శాతం వరకు వడ్డీ రేటును ప్రకటించింది. ఈ సవరించిన రేట్లు ఫిబ్రవరి 21 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)