దిగ్గజ కంపెనీ నిర్ణయం: వేలాది ఉద్యోగులపై ఎఫెక్ట్!

Published on Wed, 05/28/2025 - 09:24

ఐటీ పరిశ్రమలో ఉద్యోగ కోతలు మరింత పెరుగుతున్నాయి. మైక్రోసాఫ్ట్ ఇటీవల దాదాపు 6,700 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఐబీఎం కంపెనీ ఏకంగా 8,000 మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.

ఐబీఎం కంపెనీ తొలగించనున్న ఉద్యోగుల జాబితాలో అధికంగా హెచ్ఆర్ విభాగానికి చెందినవారే (సుమారు 200 మంది) ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని తొలగించడానికి ప్రధాన కారణం.. హెచ్ఆర్ ఉద్యోగుల పనిచేయడానికి కంపెనీ ఏఐ టెక్నాలజీని ప్రవేశపెట్టడమే. సమాచారాన్ని సేకరించడం, ఉద్యోగుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, పేపర్ వర్క్ నిర్వహించడం వంటి పనులను పూర్తి చేయడానికి కంపెనీ ఏఐను అభివృద్ధి చేసింది.

ఏఐ టెక్నాలజీ పనిని మరింత వేగంగాఈ చేయడంతో.. హెచ్ఆర్ ఉద్యోగుల అవసరం దాదాపు అనవసరమని భావించి కంపెనీ లేఆప్స్ ప్రకటించినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఈ విభాగంలో మరింత మంది ఉద్యోగులు.. తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 2024 నాటికి ఐబీఎంలో ఉద్యోగుల సంఖ్య 2.8 లక్షలు. అయితే కంపెనీ ఉద్యోగుల తొలగింపు చేపట్టిన తరువాత ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతుంది.

ఇదీ చదవండి: ఏఐ ఆటోమేషన్‌కే ప్రాధాన్యత: నివేదికలో కీలక అంశాలు

సంస్థలో కొన్ని పనులను ఆటోమేట్ చేయడం వల్ల ఇతర విభాగాల్లో పెట్టుబడులు పెట్టడానికి వనరులు సమకూరుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్‌ను కొన్ని ఎంటర్‌ప్రైజ్‌ వర్క్‌ఫ్లోలపై ఉపయోగించడం వల్ల కార్యకలాపాల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య పెరిగింది. ఇతర విభాగాల్లో ఉద్యోగులను రిక్రూట్‌ చేసుకునేందుకు హెచ్‌ఆర్‌లోని ప్రస్తుత ఏఐ వ్యవస్థలు అవకాశం కల్పిస్తున్నాయని కంపెనీ సీఈఓ అరవింద్ కృష్ణ తెలిపారు.

Videos

హీట్ పెంచిన KCR కామెంట్స్.. రేవంత్, బాబుపై సెటైర్లు

పండుగను తలపించేలా జగన్ జన్మదిన వేడుకలు..

కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్

YS జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్..

ఒకరోజు ముందే ఏపీ వ్యాప్తంగా సంబరాలు

సినిమా హీరోలు కూడా సరిపోరు.. ఆరోజుల్లోనే జగన్ క్రేజ్ ఎలా ఉండేదంటే

వివాదాల్లో కోదాడ పోలీసులు.. CI సస్పెండ్, ఎస్సై బదిలీ

హైదరాబాదులో ఘనంగా YSRCP అధినేత YS జగన్ జన్మదిన వేడుకలు

బీజేపీలో చేరిన సినీ నటి ఆమని

హాలీవుడ్ హీరోలా రోషన్.. ఛాంపియన్ బ్లాక్ బస్టర్ అంతే..!

Photos

+5

మెరిసిన జెమీమా..మురిసిన విశాఖ (ఫొటోలు)

+5

ఆది సాయికుమార్ ‘శంబాల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

బిగ్‌బాస్‌-9 విజేతగా కల్యాణ్‌.. ట్రోఫీతో ఎక్స్‌ కంటెస్టెంట్స్‌ (ఫోటోలు)

+5

బ్యాంకాక్ ట్రిప్‌లో తెలుగు సీరియల్ బ్యూటీ నవ్యస్వామి (ఫొటోలు)

+5

జగన్‌ మావయ్యతో క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

పుస్తకాల పండుగ వచ్చేసింది.. వెళ్దాం పదండి (ఫొటోలు)

+5

భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ లాంఛ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌.. అరుదైన (రేర్‌) ఫొటోలు

+5

ఏపీవ్యాప్తంగా వైఎస్‌ జగన్‌ ముందస్తు బర్త్‌ డే వేడుకలు (ఫొటోలు)