ఆ పరీక్ష మిస్ అవ్వడం వల్లే.. సక్సెస్ అయ్యా!: నందన్ నీలేకని

Published on Fri, 10/24/2025 - 14:55

జరిగేదంతా మన మంచికే అనే మాట.. చాలామంది తమ నిత్యజీవితంలో అనేక సందర్భాల్లో వినే ఉంటారు. కానీ జరిగిపోయింది కూడా మంచికే అంటున్నారు.. ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ 'నందన్ నీలేకని' (Nandan Nilekani). ఇంతకీ ఎందుకిలా అంటున్నారు?, దాని వెనుక ఉన్న కారణం ఏమిటనేది.. ఇక్కడ చూసేద్దాం.

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే (IIT Bombay) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నీలేకని.. ఆ తరువాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM)లో జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలనుకున్నారు. కానీ అదే సమయంలో తనకు ఆరోగ్యం సరిగ్గాలేకపోవడంతో.. పరీక్ష రాయలేకపోయారు. అంతే కాకుండా.. SAT లేదా GMATకు అప్లై చేసుకోవడానికి తాను బద్దకించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఆ తరువాత ముంబైలో ఉన్న ఒక చిన్న టెక్ సంస్థ పట్ని కంప్యూటర్ సిస్టమ్స్ కంపెనీ గురించి తెలుసుకుని నందన్ నీలేకని అక్కడ చేరారు. ఆ సమయంలోనే ఎన్ఆర్ నారాయణమూర్తి (NR Narayana Murthy)ని కలిశారు. అప్పుడే తన జీవితం ఒక మలుపు తిరిగింది. సొంతంగా కంపెనీ స్థాపించాలని నారాయణమూర్తి ఆలోచన నచ్చింది. దీంతో నా అడుగులు.. ఆయన వెంట సాగాయని నీలేకని వెల్లడించారు. మా ప్రయాణంలో.. మాలాంటి ఆలోచన కలిగిన మరో ముగ్గురుని కలిశాము. ఆ తరువాత ఇన్ఫోసిస్ స్థాపించామని వివరించారు.

ఇన్ఫోసిస్ ప్రారంభించినప్పుడు.. చాలా ఇబ్బందులను ఎదురుకున్నారు. కానీ పట్టుదలతో శ్రమించడం వల్లనే.. ఆ కంపెనీ దిగ్గజ ఐటీ కంపెనీల జాబితాలో ఒకటిగా నిలిచింది. 2002 మార్చి నుంచి 2007 ఏప్రిల్ వరకు ఇన్ఫోసిస్ సీఈఓగా పనిచేశారు. ఆ సమయంలో కంపెనీ గణనీయమైన వృద్ధిని సాధించింది.

నిజానికి ఆ రోజు పరీక్ష రాయకపోవడమే మంచిదైందని నీలేకని చెబుతారు. ఒకవేళ పరీక్ష రాసుంటే.. విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఆ పరీక్ష రాయకపోవడం వల్ల.. నారాయణమూర్తిని కలిసి కంపెనీ స్థాపించారు. ఇదంతా చూస్తుంటే.. ఆ రోజు జరిగిన పని నందన్ నీలేకని జీవితాన్నే మార్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇదీ చదవండి: 'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)