ఏపీ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి
Breaking News
హ్యుందాయ్ కార్ల ధరల పెంపు
Published on Thu, 08/20/2026 - 15:41
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) తమ అన్ని మోడళ్ల కార్ల ధరలను 1 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. నూతన ధరలు వచ్చే నెల (సెప్టెంబర్) నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ ధరల పెంపు మారనుందని స్పష్టం చేసింది. పెరిగిన ఇన్పుట్, కమోడిటీ వ్యయాలు, తీవ్రమవుతున్న నిర్వహణ ఖర్చులు, అంతర్జాతీయ స్థూల ఆర్థిక అనిశ్చితుల భారాన్ని తట్టుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
పెరిగిన వ్యయాలను వీలైనంత వరకు తామే భరించామని, అయితే భారం నిరంతరం పెరుగుతుండటంతో వినియోగదారులకు ధరల రూపంలో స్వల్పంగా బదలాయించాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత భారత మార్కెట్లో హ్యుందాయ్.. హ్యాచ్‌బ్యాక్ ‘గ్రాండ్ ఐ10 నియోస్’ నుంచి ఈవీ ఎస్యూవీ ‘ఐఓఎన్‌ఐక్యూ 5’ వరకు వివిధ మోడళ్లను విక్రయిస్తోంది.
ఇదీ చదవండి: మరోసారి పెరగనున్న టాటా కార్ల ధరలు?
Tags : 1