Breaking News

హైదరాబాద్‌లో భూముల ధరలు.. ఆకాశం వైపు..

Published on Sat, 06/28/2025 - 18:11

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ నగరంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీ(కేపీహెచ్‌బీ)లో నిర్వహించిన బహిరంగ వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది. దేశంలో అత్యంత డిమాండ్‌ ఉన్న నగరాలలో హైదరాబాద్‌ ఒకటిగా నిలిచింది. కేపీహెచ్‌బీలో చదరపు గజం ధర రూ.2.98 లక్షలకు అమ్ముడుపోయింది.

ఐటీ హబ్‌కు చేరువలో ఉండటం వల్లే ఈ భూములకు అత్యధిక డిమాండ్‌ ఉందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. నగరంలో ఐటీ నిపుణులు, సంస్థలను ఆకర్షిస్తూనే ఉంది. గృహాలు, ఆఫీసు స్థలాలకు డిమాండ్‌ పెరుగుతూనే ఉంది. అయితే ఇన్వెంటరీ, అందుబాటుకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. హైటెక్‌ సిటీ నుంచి 40 నిమిషాల ప్రయాణ వ్యవధిలో ఉన్న ప్రాంతాలలో బ్రాండెడ్‌ డెవలపర్లు కానీ ప్రాజెక్ట్‌లలో కూడా అపార్ట్‌మెంట్ల ధరలు రూ.1.2 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ఉన్నాయంటే డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు.  

మెరుగైన మౌలిక వసతులు 
మౌలిక సదుపాయాల విస్తరణ, కనెక్టివిటీ, కొత్త మెట్రో లైన్లు, ఎక్స్‌ప్రెస్‌ వేస్, ఐటీ పార్క్‌లతో నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి శరవేగంగా సాగుతోంది. దీంతో నగరంలో స్థిరాస్తి పెట్టుబడి అవకాశాలు బాగా పెరిగాయి. ప్రధాన వాణిజ్య కేంద్రాలకు చేరువలో ఉన్న ప్రాంతాలలో, మెరుగైన కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలలో భూముల ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. అలాగే ప్రణాళికాబద్ధమైన కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. నగరం శివారు ప్రాంతాల వైపు విస్తరిస్తుండటంతో కాలనీ, గేటెడ్‌ కమ్యూనిటీలు పెట్టుబడులను ఆకర్షించే కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి.

👉 ఇదీ చదవండి: మేడ్చల్‌ క్లస్టర్‌ హవా.. ఆ స్థలాలకు ఫుల్‌ డిమాండ్‌

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)