Breaking News

భారత్‌లో టెస్లా ఎలక్ట్రిక్‌.. కార్ల ధరలు ఇంత తక్కువా?

Published on Sun, 12/31/2023 - 13:13

భారతీయులకు శుభవార్త. దేశంలో ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లా రాకకు మార్గం సుగమమైంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే భారత్‌లో టెస్లామోడల్‌ 3 కారు బడ్జెట్‌ ధరలో వాహనదారులకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.  

పలు నివేదికల ప్రకారం.. అపరకుబేరుడు టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ మరికొద్ది రోజుల్లో భారత్‌లో పర్యటించనున్నారు. జనవరి 10 నుంచి 12 వరకు జరిగే వైబ్రాంట్‌ గుజరాత్‌ గ్లోబుల్‌ సమ్మిట్‌లో పాల్గొనేందుకు భారత్‌లో పర్యటించన్నట్లు సమాచారం. ఇప్పటికే టెస్లా కార్ల తయారీ యూనిట్‌ను గుజరాత్‌లో ఏర్పాటు చేసే దిశగా కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌కు కావాల్సిన అనుమతులు, స్థల అన్వేషణ త్వరగా జరిగేలా గుజరాత్‌ సమ్మిట్‌ దోహదం చేయనుంది.

ఈ నివేదికలపై టెస్లా యూనిపై కేంద్రం గాని అటు టెస్లా కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వైబ్రాంట్‌ గుజరాత్‌ గ్లోబుల్‌ సమ్మిట్‌లో ప్రధాని మోదీ సమక్షంలో ఎలాన్‌ మస్క్‌ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.  

టెస్లా కార్ల ధరలు ఎంతంటే?
పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, టెస్లా ధరలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒకే విధంగా ఉన్నాయి.  ప్రస్తుతం అందుబాటులో ఉన్న చౌకైన మోడల్ టెస్లా మోడల్ 3 బేస్ వేరియంట్ ధర 40,240 (సుమారు రూ. 33.5 లక్షలు). ఈ మోడల్‌ను భారత్‌లోకి దిగుమతి చేసుకోవడం వల్ల రూ.60-66 లక్షల వరకు ఖర్చు అవుతుంది. భారతదేశం  40,000 డాలర్ల  కంటే ఎక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలపై (EVలు) 100 శాతం దిగుమతి పన్నును విధించింది.

అన్నీ సవ్యంగా జరిగితే 
అన్నీ సవ్యంగా జరిగితే  టెస్లా ఏడాదికి 5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉందని నివేదికలు పేర్కొన్నాయి. అయితే, దీని ధర అనూహ్యంగా రూ. 20 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)