Breaking News

మొబైల్‌లో త్వరగా ఛార్జింగ్‌ అయిపోతుందా?

Published on Fri, 05/30/2025 - 11:52

మీ మొబైల్‌లో ఛార్జింగ్‌ త్వరగా అయిపోతుందా? మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ ఉందా? అయితే దానిపై ఓ లుక్కేయాల్సిందే. ఫోన్‌లో త్వరగా బ్యాటరీ అయిపోతుందంటే దానికి మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసిన ఇన్‌స్ట్రాగ్రామ్‌ యాప్‌ కారణం కావొచ్చని గూగుల్‌ పోస్ట్‌లో తెలిపింది. ఈ సమస్య పిక్సెల్‌ ఫోన్‌ వినియోగదారులకు అధికంగా ఉందని పేర్కొంది.

గత కొన్ని వారాలుగా పిక్సెల్‌ వినియోగదారులు తమ పరికరాల్లో బ్యాటరీ సమస్యలను నివేదించినట్లు గూగుల్‌ తెలిపింది. అందుకుగల కారణాన్ని ధ్రువీకరించింది. మొబైల్‌ బ్యాక​్‌గ్రాండ్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ అధిక బ్యాటరీ వినియోగానికి కారణమవుతుందని గూగుల్ సపోర్ట్ పోస్ట్‌లో వెల్లడించింది. పిక్సెల్ పరికరాలకు మే నెలలో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ ఇచ్చినట్లు పేర్కొంది. అప్పటి నుంచి ఈ సమస్య మరింత ఎక్కువైందని చెప్పింది.

ఇదీ చదవండి: నోట్ల ముద్రణకు రూ.6,373 కోట్లు ఖర్చు!

ప్రపంచవ్యాప్తంగా మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ను ఆండ్రాయిడ్‌ ఓఎస్‌లో దాదాపు 100 కోట్లకు పైగా యూజర్లు వినియోగిస్తున్నారు. అయితే ఈ యాప్ బ్యాటరీ లైఫ్‌ను ఎలా తగ్గిస్తోందో తెలియజేయడానికి యూజర్లు రెడిట్ వేదికగా తమ సమస్యలు నివేదించారు. ఇన్‌స్టాగ్రామ్‌ పాత వెర్షన్‌కు తిరిగి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్లు కొందరు తెలిపారు. ఇంకొందరు ఓవర్ హీటింగ్ వంటి మరిన్ని సమస్యలను చెప్పారు.

ఈ సమస్యకు పరిష్కారం..?

బ్యాటరీ డ్రెయిన్‌ సమస్యను పరిష్కరించడానికి ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే దీనిపై మెటా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌ సమస్యకు పరిష్కారాన్ని ప్రారంభించినట్లు గూగుల్ ధ్రువీకరించింది. ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో బ్యాటరీ డ్రైన్ సమస్యను పరిష్కరించడానికి ఇన్‌స్టాగ్రామ్ అప్‌డేటెడ్ యాప్‌ను విడుదల చేస్తుందని, బ్యాటరీ సమస్యను పరిష్కరించడానికి వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా యాప్‌ను అప​్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)