Breaking News

కథన రంగంలో ఏఐ చిందులు

Published on Sat, 05/03/2025 - 09:46

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అన్ని రంగాల్లోనూ ప్రవేశించింది. ఏఐ సినిమా పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. చిత్ర నిర్మాణంలోని ప్రతి అంశాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతుండడంతోపాటు సినిమాపై ప్రేక్షకుల అంచనాలను పెంచుతోంది. సృజనాత్మక ప్రక్రియలను మెరుగుపరచడం, వర్క్‌ఫ్లోలను ఆప్టిమైజ్ చేయడం, వీక్షకుల అనుభవాలను విశ్లేషించడం ద్వారా ఏఐ ఒక శక్తివంతమైన సాధనంగా మారుతోంది. కృత్రిమ మేధ సినిమా ప్రీ-ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఆడియన్స్ ఇంటరాక్షన్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.

ప్రీ ప్రొడక్షన్

స్క్రిప్ట్ రైటింగ్, కాస్టింగ్, స్టోరీబోర్డింగ్‌.. వంటి ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఏఐ సాయం చేస్తోంది. స్క్రిప్ట్‌బుక్‌, ప్లాటగాన్ వంటి సాధనాలు స్క్రిప్ట్‌ను విశ్లేషించడానికి, బాక్సాఫీస్ పనితీరును అంచనా వేయడానికి, భావోద్వేగ అంశాలు, సంభాషణ ఆధారంగా కథలో మెరుగుదలను సూచించడానికి నేచురల్‌ ల్యాంగ్వేజ్‌ ప్రాసెసింగ్ (ఎన్ఎల్‌పీ)ను ఉపయోగిస్తున్నాయి. ఇది సినీ రచయితలు తమ కథలను మెరుగుపరచడానికి, నిర్మాతలు బడ్జెట్లను సమర్థవంతంగా కేటాయించడానికి సహాయపడుతుంది.

కాస్టింగ్‌.ఏఐ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌లు దర్శకులు ఎంచుకున్న పాత్రలకు వర్చువల్‌గా నటులను గుర్తించేందుకు వారి ముఖాల కవళికలను విశ్లేషిస్తుంది. స్టోరీబోర్డర్ వంటి ఏఐ ఆధారిత సాధనాలు స్క్రిప్ట్‌లను విశ్లేషించి విజువల్ డ్రాఫ్ట్‌లను అందిస్తాయి. ఇది దర్శకులు సన్నివేశాలను ముందుగానే విజువలైజ్ చేయడానికి, సినిమాను త్వరగా చిత్రీకరించడానికి సాయం చేస్తుంది.

ప్రొడక్షన్

ప్రొడక్షన్ సమయంలో విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్), సినిమాటోగ్రఫీ, సెట్ డిజైన్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మారుస్తోంది. డాల్‌.ఈ, మిడ్‌జర్నీ వంటి జనరేటివ్ ఏఐ మోడల్స్ సినిమాలోని సన్నివేశాలకు అనుగుణంగా వర్చువల్‌గా వాస్తవికతను జోడిస్తున్నాయి. వీఎఫ్‌ఎక్స్‌లో ఏఐ రోటోస్కోపింగ్, మోషన్ క్యాప్చర్, డీ-ఏజింగ్(నటుల వయసు తగ్గినట్టు చూపడం) వంటి పనులను సులభతరం చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా కదలికలను ఆటోమేట్ చేస్తుంది. సీన్ ఆధారంగా లైటింగ్ సెటప్‌లను సూచించడం ద్వారా సినిమాటోగ్రఫీని మెరుగుపరుస్తుంది.

పోస్ట్ ప్రొడక్షన్

ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్, సౌండ్ డిజైన్లను ఆటోమేట్ చేయడం ద్వారా ఏఐ పోస్ట్ ప్రొడక్షన్‌ను క్రమబద్ధీకరిస్తుంది. అడోబ్ ప్రీమియర్ ప్రో ఆటో రిఫ్రేమ్ వంటి సాధనాలు ఇందుకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. కృత్రిమ మేధ సాధనాలు రా-ఫుటేజీని విశ్లేషిస్తాయి. కీలక దృశ్యాలను గుర్తిస్తాయి. సరైన విధంగా ఎడిట్‌ చేస్తాయి. ఐజోటోప్ ఆర్ఎక్స్ వంటి ఏఐ సాధనాలు బ్యాగ్రౌండ్‌ సౌండ్‌ను తొలగిస్తాయి. వాస్తవిక సౌండ్‌ ఎఫెక్ట్స్‌ను క్రియేట్‌ చేస్తాయి. వాయిస్ఓవర్లను మెరుగుపరుస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డబ్బింగ్ ప్లాట్‌ఫామ్‌లు సహజసిద్ధమైన ట్రాన్స్‌లేషన్‌లను అందిస్తాయి. ఇది ప్రపంచంలోని ప్రేక్షకులకు సినిమాను మరింత అందుబాటులోకి తెస్తున్నాయి.

డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్కెటింగ్

సినిమాను ఎలా మార్కెటింగ్ చేయాలి.. ఎలా డిస్ట్రిబ్యూషన్ చేయలనే అంశాలను ఏఐ పునర్నిర్మిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల్లో వ్యూయర్‌షిప్‌ను విశ్లేషించడానికి ఏఐ అల్గారిథమ్‌లు ఉపయోగపడుతున్నాయి. వ్యక్తిగత వినియోగదారుల కోసం తగిన ట్రైలర్లు, పోస్టర్లను సృష్టిస్తున్నాయి. ప్రమోషన్‌లో భాగంగా జానర్ ప్రాధాన్యతలు లేదా ఇష్టమైన నటుల ఆధారంగా నిర్దిష్ట ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. డిస్ట్రిబ్యూషన్‌లో భాగంగా ఏఐ టూల్స్ మార్కెట్ పోకడలు, సోషల్ మీడియా సెంటిమెంట్, చారిత్రాత్మక డేటాను విశ్లేషించి విడుదల తేదీలను సూచిస్తున్నాయి. దీంతోపాటు పైరసీని ఎదుర్కోవటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడుతుంది.

ఆడియన్స్ ఎంగేజ్‌మెంట్‌

ఇంటరాక్టివ్ ఫార్మాట్లను రూపొందించడం ద్వారా సినిమాపై ప్రేక్షకుల అభిప్రాయాలు తెలుసుకునే వీలుంటుంది. ఏఐ ఆధారిత వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) వంటివి ప్రేక్షకులను సినిమాకు మరింత దగ్గర చేస్తున్నాయి. ఏఐ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్‌ను విశ్లేషిస్తుంది. మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరచడంలో స్టూడియోలకు సహాయపడుతుంది.

ఇదీ చదవండి: భారత్‌–అమెరికా మధ్య డీల్‌..?

సవాళ్లు లేవా..?

ఏఐ సినిమాకు అపారమైన సామర్థ్యాన్ని అందిస్తుండగా, నైతిక, సృజనాత్మక ఆందోళనలను కూడా లేవనెత్తుతుంది. డీప్‌ఫేక్‌ టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో అనుమతి లేకుండా నటుల పోలికలు లేదా స్వరాలను కాపీ కొట్టేలా కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. సినిమా పరిశ్రమలోని క్రియేటివ్‌ ఉద్యోగులకు ఏఐ ముప్పుగా మారుతోంది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్, ఎడిటింగ్‌లో ఎంట్రీ లెవల్ ఆర్టిస్టులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఏఐ ఆటోమేటెడ్ ఎడిటింగ్ వల్ల సన్నివేశాల్లోని భావోద్వేగాలు కోల్పేయే ప్రమాదం కూడా ఉంది. ఏదేమైనా ఏఐ చాలా వరకు సినీ ప్రపంచంలో ఇప్పటికీ పాగా వేసింది. ఏ రంగంలోనైనా ఏఐ ప్రభావం కొంత వరకే ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్రియేటివ్‌ పరిశ్రమలో నిత్యం చేసే పనులను మాత్రమే ఏఐతో ఆటోమేట్‌ చేయవచ్చని చెబుతున్నారు. సృజనాత్మకంగా ఆలోచించి, మంచి సన్నివేశాలకు ప్రాధాన్యత ఇస్తూ కళామతల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఏఐ కంటే మానవులపైనే అధికంగా ఉందంటున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)