Breaking News

హిండెన్‌బర్గ్ 2.0: అదానీ గ్రూప్​పై మరో పిడుగు.. ఓసీసీఆర్‌పీ సంచలన ఆరోపణలు

Published on Thu, 08/31/2023 - 11:40

అదానీ గ్రూప్ స్టాక్స్‌లో విదేశీ పెట్టుబడులకు సంబంధించి గతంలోనే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు ఇంకా చల్లారకముందే ఇలాంటి ఆరోపణలు చేస్తూ 'ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్' (OCCRP) రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇందులో అదానీ కుటుంబానికి సన్నిహితులైన కొందరు మారిషస్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం.. మల్టిపుల్ టాక్స్ హెవెన్ సంస్థలను వాడుకుని ఆదానీ లిస్టెడ్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టినట్లు హిండెన్‌బర్గ్ గతంలో ఆరోపించింది. కాగా ఇప్పుడు తాజాగా ఓసీసీఆర్పీ కూడా ఇదే ఆరోపించింది. ఈ రిపోర్టులన్నీ నిరాధారమైనవని, పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నట్లు ఆదానీ హిండెన్‌బర్గ్ తర్వాత వెల్లడించాడు. 

హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తరువాత ఆదానీ గ్రూప్ కంపెనీలు తమ మార్కెట్లో విలువలో 150 మిలియన్ డాలర్లను కోల్పోయాయి. కాగా ఇప్పుడు వెలువడిన రిపోర్ట్ కూడా హిండెన్‌బర్గ్ రిపోర్ట్ మాదిరిగానే నిరాధారంగా ఉందని ఆదానీ గ్రూప్ వెల్లడించింది.

అదానీ గ్రూప్‌కి సంబంధించిన పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు తమ షేర్ హోల్డింగ్‌లకు సంబంధించి కావలసిన చట్టాలకు లోబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. కాగా గతంలో వెలువడిన హిండెన్‌బర్గ్ రిపోర్ట్ మీద ఇప్పటికీ సెబీ దర్యాప్తు చేస్తూనే ఉంది. కాగా తాజా నివేదికలు మరింత కలకలం రేపుతున్నాయి. 

ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన ఆనంద్ మహీంద్రా! రాఖీ పండుగ వేళ..

ఇదిలా ఉండగా ఈ రోజు స్టాక్ మార్కెట్లు ప్రారంభమైన కొంత సేపటికే అదానీ గ్రూప్ స్టాక్‌లు రెడ్ జోన్‌లోకి జారిపోయాయి. అదానీ పవర్ షేర్లు 3 శాతానికి పైగా నస్టపాయాయి. అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్ ధర 3.3 శాతానికి పడిపోయింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ ధర 2.50 శాతం మేర నష్టపోగా, అదానీ గ్రీన్ ఎనర్జీ , అదానీ టోటల్ గ్యాస్ 2.25 శాతం మేర నష్టపోయాయి.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)