Breaking News

ఏడు పవర్‌ఫుల్‌ ఏఐ టూల్స్‌..

Published on Sat, 11/15/2025 - 16:21

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం పెరుగుతోంది. దాంతో కంపెనీలు వినియోగదారులను పెంచుకునేందుకు విభిన్న విభాగాల్లో ఏఐ టూల్స్‌ను ఆవిష్కరిస్తున్నాయి. ఇప్పటికే చాలా టూల్స్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే నిపుణులు, విద్యార్థులు, వ్యాపారులకు ఉపయోగకరంగా ఉంటున్న కొన్ని ఏఐ టూల్స్‌ గురించి తెలుసుకుందాం. అయితే ఈ టూల్స్‌లోని కొన్ని సదుపాయాలు ఉచితంగా లభిస్తుంటే మరిన్ని ఫీచర్ల కోసం ఆయా సంస్థల నిబంధనల ప్రకారం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుందని గమనించాలి.

కర్సర్ ఏఐ

  • కర్సర్ ఏఐ విజువల్ స్టూడియో కోడ్ (VS Code) ఆధారంగా పనిచేసే ఏఐ పవర్డ్ కోడ్ ఎడిటర్.

  • కోడ్ రాయడం, డీబగ్గింగ్, రీఫాక్టరింగ్, నేచురల్‌ ల్యాంగ్వేజీ ఇన్‌పుట్స్ నుంచి కోడ్ రూపొందించడంలో సహాయపడుతుంది.

  • ప్రత్యేకంగా డెవలపర్లకు కోపైలట్ అసిస్టెంట్‌గా పని చేస్తుంది.

  • ఉచిత ప్లాన్‌తో ప్రారంభించి అవసరాలకు తగ్గట్టు అప్‌గ్రేడ్ చేయవచ్చు.

మిడ్ జర్నీ (Midjourney)

  • నేచురల్‌ ల్యాంగ్వేజ్‌ ప్రాంప్ట్‌లతో ఈ ఏఐ టూల్‌ను ఉపయోగించవచ్చు.

  • డిఫ్యూజన్ మోడల్ ఆధారంగా పనిచేసే ఈ టూల్‌ సృజనాత్మక ఆర్ట్, విజువల్స్, కాన్సెప్ట్ ఆర్ట్‌కి అనువైంది.

డిస్క్రిప్ట్

  • ఏఐ ఆధారిత ఆడియో, వీడియో ఎడిటింగ్ టూల్.

  • టెక్స్ట్ ట్రాన్స్‌క్రిప్షన్ ఆధారంగా మీడియా ఎడిటింగ్ చేయగలదు. ఇది వీడియో, పోడ్‌కాస్ట్ సృష్టికర్తల కోసం ఎంతో ఉపయోగపడుతుంది.

  • ఏఐ కో-ఎడిటర్ ఆడియో నాణ్యత పెంచుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌ శబ్దాన్ని తొలగిస్తుంది.

క్లాడ్ ఏఐ (Anthropic)

  • రైటింగ్‌, కోడింగ్, టెక్ట్స్‌ సమ్మరైజింగ్‌, డేటా విశ్లేషణలో సహాయం చేస్తుంది.

  • వెబ్, ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉంటుంది.

రన్ వే ఎంఎల్‌

  • వీడియో, ఫిల్మ్ ఎడిటింగ్ కోసం ఏఐ ప్లాట్‌ఫామ్.

  • ఇమేజ్ టు వీడియో, టెక్స్ట్ టు వీడియో సాధ్యం అవుతుంది.

పర్‌ప్లెక్సిటీ ఏఐ

  • ఏఐ ఆధారిత సెర్చ్‌ ఇంజిన్‌.

  • వాయిస్ సెర్చ్, టాపిక్ డిస్కవరీ, ప్రాజెక్ట్ నిర్వహణకు సాయం చేస్తుంది.

ఫ్లికి ఏఐ

  • టెక్స్ట్ వాయిస్‌ఓవర్ వీడియో ప్లాట్‌ఫామ్.

  • మార్కెటింగ్, ఇన్‌స్టిట్యూషనల్ వీడియోల కోసం ఉపయోగపడుతుంది.

ఇదీ చదవండి: ప్రపంచంలో 10 పవర్‌ఫుల్‌ మిలిటరీ దేశాలు

#

Tags : 1

Videos

ibomma : ఇమ్మడి రవికి 14 రోజులు రిమాండ్

పద్దతిగా మాట్లాడు.. లేదంటే.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు వార్నింగ్

Ding Dong: బాబు దెబ్బకు డాక్టర్లు అంటేనే వణికిపోతున్నారు

మేం సిద్ధంగా ఉన్నాం..! ఈసీకి విజయ్ లేఖ

ఆ పార్టీలోకి వంగవీటి రంగా కూతురు. పొలిటికల్ ఎంట్రీ

Jubilee Hills by Election Results: ఫలితాలపై ఫన్నీ రియాక్షన్

ఢిల్లీ బ్లాస్ట్... మరో డాక్టర్ అరెస్ట్

Jangaon : మరో ఘోర ప్రమాదం RTC బస్సు నుజ్జునుజ్జు

Hindupur : ముందే పోలీసులకు చెప్పి YSRCP ఆఫీసుపై దాడి

Chandrababu: బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ

Photos

+5

సీరియల్ నటి చైత్రారాయ్ సీమంతం (ఫొటోలు)

+5

వారణాసి ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా.. అదిరిపోయేలా స్టిల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 16-23)

+5

'వారణాసి'లో మహేష్‌ బాబు.. టైటిల్‌ గ్లింప్స్‌ (ఫోటోలు)

+5

నువ్వే నా నంబర్ వన్ లవ్.. యాంకర్ రష్మీ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్‌ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

#KrithiShetty : క్యూట్ లూక్స్‌తో కృతి శెట్టి (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)