Breaking News

అమెరికా టారిఫ్‌ల ప్రభావం ఇదిగో ఇంతే..

Published on Thu, 09/11/2025 - 10:36

అమెరికా టారిఫ్‌ల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీపై నికరంగా పడే ప్రభావం 0.2–0.3 శాతం వరకు ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ అంచనా వేశారు. అయితే జీఎస్‌టీలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశీ డిమాండ్‌ను పెంచడం ద్వారా ఈ ప్రభావాన్ని భర్తీ చేస్తాయని అభిప్రాయపడ్డారు.

ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద అమెరికాకు చేసిన ఎగుమతుల్లో సగం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐదు నెలల్లోనే నమోదైనట్టు గుర్తు చేశారు.

సుంకాలు స్వల్పకాలమే గానీ, దీర్ఘకాలం పాటు కొనసాగకపోవచ్చన్నారు. ఒకవేళ దీర్ఘకాలం పాటు కొనసాగితే అప్పుడు ద్వితీయ, తృతీయ అంచ ప్రభావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయంటూ.. పెట్టుబడులు, మూలధన వ్యయాలు, ఆర్థిక వ్యవస్థ సెంటిమెంట్‌పై దీని తాలూకూ అనిశ్చితి ఉంటుందని చెప్పారు.

అయితే, జీఎస్‌టీలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశీయంగా బలమైన వినియోగ సృష్టి ద్వారా టారిఫ్‌ల తాలూకూ ద్వితీయ, తృతీయ అంచ ప్రభావాలను అధిగమించేందుకు సాయపడతాయన్నారు. కనుక మొత్తం మీద జీడీపీపై పడే ప్రభావం 0.3 శాతం మించి ఉండదన్నారు. 2025–26 సంవత్సరానికి 6.3–6.8% మధ్య జీడీపీ వృద్ధి నమోదు కావొచ్చన్న తమ అంచనాలను గుర్తు చేశారు.

సాగులో సంస్కరణలు.. 
వ్యవసాయ రంగం జీడీపీకి మరో 0.5–0.70 శాతం వరకు తోడ్పాటునివ్వగలదని  నాగేశ్వరన్‌ తెలిపారు. ఇందుకు గాను రైతులు వారు కోరుకున్న చోట విక్రయించే హక్కు అవసరమన్నారు. ప్రకృతి విపత్తులపై సాగు దిగుబడులు ఆధారపడి ఉన్నందున వారికి బీమా రూపంలోనూ దన్నుగా నిలవాలన్నారు. ప్రపంచ వాణిజ్యం విషయంలో అంతర్జాతీయ కరెన్సీగా ఉన్న డాలర్‌ స్థానాన్ని భర్తీ చేసే ఎలాంటి ప్రతిపాదన లేదని సీఈఏ అనంత నాగేశ్వరన్‌ స్పష్టం చేశారు.

అటువంటి చర్యలో భారత్‌ పాలుపంచుకోదని ఓ ప్రశ్నకు సమాధనంగా చెప్పారు. డాలర్‌కు మెరుగైన ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి లేదంటూ.. ఇందుకు చాలా కాలం పట్టొచ్చన్నారు. గతేడాది జరిగిన బ్రిక్స్‌ సదస్సులో భాగస్వామ్య దేశాల మధ్య వాణిజ్యానికి స్థానిక కరెన్సీల్లో చెల్లింపులకు, ప్రత్యేకంగా బ్రిక్స్‌ కరెన్సీ ఏర్పాటుకు అంగీకారం కుదరడం గమనార్హం.

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)