Breaking News

భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. సెప్టెంబర్‌లో ఎంతొచ్చాయంటే..

Published on Sun, 10/01/2023 - 17:39

దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. గడిచిన ఆగస్టు నెలకు సంబంధించి సెప్టెంబర్‌లో వసూలు చేసిన ఆగస్టు స్థూల వస్తు, సేవల పన్ను జీఎస్టీ 10 శాతం పెరిగి రూ.1,62,712 కోట్లకు చేరుకుంది.

2023-24 ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ స్థూల జీఎస్టీ వసూళ్లు గతేడాది కంటే 11 శాతం వృద్ధితో రూ. 1.65 లక్షల కోట్లుగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెళ్లలో మొత్తం స్థూల వసూళ్లు ఇప్పటివరకు రూ. 9.92 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. ఇవి అంతకు ముందు సంవత్సరం కంటే 11 శాతం అధికం.

2023 మార్చిలో లావాదేవీలకు సంబంధించి ఏప్రిల్‌ నెలలో అత్యధికంగా రూ. 1.87 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో పన్ను చెల్లింపులు పుంజుకోవడంతో అత్యధిక వసూళ్లు వచ్చాయి.

దేశీయ లావాదేవీల (సర్వీస్‌ ఇంపోర్ట్స్‌ సహా) ఆదాయం సెప్టెంబరు నెలలో అంతకు ముందు సంవత్సరం కంటే 14 శాతం ఎక్కువగా వచ్చింది. ఇక ఈనెలలో వసూలైన స్థూల జీఎస్టీ ఆదాయం  రూ. 1,62,712 కోట్లు కాగా ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ.29,818 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ. 37,657 కోట్లు. అలాగే ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 83,623 కోట్లు, వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన మొత్తం రూ.41,145 కోట్లు. అదే విధంగా సెస్ రూపంలో వసూలైంది రూ.11,613 కోట్లు కాగా ఇందులో రూ.881 కోట్లు వస్తువుల దిగుమతిపై వసూలు చేశారు.

తెలంగాణలో రికార్డుస్థాయి వృద్ధి
ఇక రాష్ట్రాలవారీగా చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 17 శాతం వార్షిక వృద్ధితో రూ.25,137 కోట్లు వసూలైంది. రెండవ స్థానంలో నిలిచిన కర్ణాటక రూ. 11,693 కోట్లు (20 శాతం వృద్ధి) నమోదు చేసింది. తమిళనాడు కలెక్షన్లు రూ.10,481 కోట్లు (21 శాతం వృద్ధి), గుజరాత్‌లో జీఎస్టీ వసూళ్లు  రూ.10,129 కోట్లు (12 శాతం వృద్ధి) నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణ రికార్డు స్థాయిలో వార్షిక వసూళ్లలో 33 శాతం వృద్ధిని నమోదు చేసి రూ. 5,226 కోట్లు వసూలు చేయడం విశేషం.

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)