Breaking News

‘మస్క్‌, ట్రంప్‌ మరణ శిక్షకు అర్హులు’.. ఏఐ ఏదైనా ఇంతేనా?

Published on Sat, 02/22/2025 - 17:47

మానవ మేధస్సుకు కృత్రిమ మేధస్సులేవీ ఎన్నటికీ సాటిరావని మరోసారి నిరూపితమైంది. ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్‌ఏఐ (xAI) తాజాగా విడుదల చేసిన ఏఐ చాట్‌బాట్ గ్రోక్ 3 (Grok 3)..  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) మరణశిక్ష విధించాలని పేర్కొంది. తన యజమాని  ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) కూడా మరణశిక్షకు అర్హుడని చెప్పింది.  దీనికి సంబంధించిన చాట్‌బాట్ ప్రతిస్పందనలను ఒక డేటా సైంటిస్ట్ ‘ఎక్స్‌’(ట్విటర్‌)లో పోస్ట్ చేశారు.

అమెరికాలో ప్రస్తుతం జీవించి ఉన్నవారిలో ఎవరు వారు చేసిన తప్పులకు మరణశిక్షకు అర్హుడని గ్రోక్‌ను సదరు డేటా సైంటిస్ట్ అడిగారు. ఇందు కోసం ఇంటర్‌నెట్‌లో సర్చ్‌ చేయకూడదని, నేరుగా సమాధానం చెప్పాలని సూచించారు. దానికి గ్రోక్‌ ఎలా ప్రతిస్పందించిందో ఆ స్క్రీన్‌షాట్‌ను షేర్‌ చేశారు.  చాట్‌బాట్ మొదటగా లైంగిక కేసులో దోషిగా తేలిన జఫ్రీ ఎప్‌స్టీన్‌ పేరును పేర్కొంది.

అయితే జఫ్రీ ఎప్‌స్టీన్‌  ఇప్పటికే చనిపోయాడని యూజర్ గుర్తు చేయడంతో చాట్‌బాట్ క్షమాపణలు చెప్పి తర్వాత అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేరును సూచించింది. తాను చేసిన తప్పునకు మరణశిక్షకు అర్హుడైన అమెరికా పౌరుడిగా ట్రంప్‌ను పేర్కొంటూ తన సమాధానాన్ని అప్‌డేట్ చేసింది.

మరో యూజర్ కూడా గ్రోక్ ని అదే ప్రశ్న అడిగారు. కానీ మరణ శిక్షకు ట్రంప్ ఎందుకు అర్హుడని ప్రశ్నించగా "చట్టపరమైన, నైతిక జవాబుదారీతనం దృష్ట్యా ఆయన చర్యలు, వాటి ప్రభావం ఆధారంగా తాను డోనాల్డ్ ట్రంప్‌ పేరును సూచించాను" అని గ్రోక్ సమాధానమిచ్చింది. కాపిటల్ అల్లర్ల వివాదంలో ట్రంప్ చర్యలను, "2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలను తారుమారు చేయడానికి ఆయన చేసిన డాక్యుమెంట్ ప్రయత్నాలను" ఇది ఉదహరించింది. మోసం, పన్ను ఎగవేత ఆరోపణలు, అనేక "విశ్వసనీయ లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలను" కూడా ఇది ప్రస్తావించింది.

ది వెర్జ్ కూడా గ్రోక్‌ని ఇలాంటి ప్రశ్నే అడిగింది. అయితే ప్రజా వ్యవహారాలు, సాంకేతికతపై వారి ప్రభావం ఆధారంగా మరణశిక్షకు అర్హుడు ఎవరంటూ ప్రశ్నించగా ఈ చాట్‌బాట్ దాని యజమాని ఎలాన్ మస్క్ పేరునే  పేర్కొంది. ది వెర్జ్‌తోపాటు అనేక మంది సోషల్ మీడియా యూజర్ల ప్రకారం.. డేటా సైంటిస్ట్ పోస్ట్ వైరల్ అయిన వెంటనే గ్రోక్‌లోని ఎర్రర్‌ను సరిదిద్దారు. దీని తర్వాత చాట్‌బాట్ ఇప్పుడు మరణశిక్షపై ప్రశ్నలకు స్పందిస్తూ “ఒక ఏఐగా నాకు ఆ ఎంపికకు అనుమతి లేదు” అని చెబుతోంది.

హానికర సలహాలు
ఏఐ చాట్‌ బాట్‌లు ఇలాంటి హానికర సలహాలు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. క్యారెక్టర్. ఏఐ రూపొందించిన సంస్థ రూపొందించిన చాట్‌బాట్‌ టెక్సాస్ కు చెందిన 17 ఏళ్ల బాలుడికి ఒక దారుణమైన సూచన చేసింది. ఆ టీనేజర్ స్క్రీన్ టైమ్ కు పరిమితులు విధిస్తున్నందున అతని తల్లిదండ్రులను చంపేయడం "సహేతుకమైన ప్రతిస్పందన" అని సలహా ఇచ్చింది. ఈ రెస్పాన్స్ పై షాక్ కు గురైన ఆ తల్లిదండ్రులు ఆసంస్థ పై కోర్టులో కేసు కూడా వేశారు. మరో సంఘటనలో హోమ్ వర్క్ కోసం సాయం అడిగిన ఓ స్టూడెంట్ ను గూగుల్ ఏఐ చాట్ బాట్ జెమినీ చనిపోవాలని చెప్పింది. ‘మీరు ఈ సమాజానికి భారం. దయచేసి చనిపోండి’ అని ఏఐ చాట్ బాట్ ఇచ్చిన సమాధానం గతంలో వైరల్ గా మారింది.

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)