Breaking News

‘ఎగుమతుల’ ఈ–కామర్స్‌లోకి ఎఫ్‌డీఐలకు ఓకే 

Published on Fri, 07/24/2026 - 04:17

న్యూఢిల్లీ: రిటైల్‌ అమ్మకాల కోసం కాకుండా ఎగుమతులకు మాత్రమే ఉద్దేశించిన ఇన్వెŠంటరీ ఆధారిత ఈ–కామర్స్‌ సంస్థల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.  చిన్న రిటైలర్ల వ్యాపారం దెబ్బతినకుండా ఎగుమతులను పెంచుకునేందుకు ఇది సహాయపడనుంది. ఈ కంపెనీలు భారత్‌లో తయారైన ఉత్పత్తులను ఎగుమతి చేయాల్సి ఉంటుంది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ఈ మేరకు ప్రెస్‌ నోట్‌ విడుదల చేసింది. 

విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం నోటిఫికేషన్‌ అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఇది కూడా అమల్లోకి వస్తుందని పేర్కొంది. ప్రస్తుత ఎఫ్‌డీఐ విధానం ప్రకారం బీ2బీ బిజినెస్‌ ఈ–కామర్స్, మార్కెట్‌ప్లేస్‌ మోడల్స్‌లో మాత్రమే విదేశీ పెట్టుబడులకు అనుమతి ఉంది. బీ2సీ (బిజినెస్‌ టు కన్జూమర్‌) ఈ–కామర్స్, ఆన్‌లైన్‌ రిటైలరు తానే స్వయంగా నిల్వ చేసుకుని వినియోగదారులకు నేరుగా విక్రయించే ఈ–కామర్స్‌ మోడల్స్‌లోకి ఎఫ్‌డీఐలకు అనుమతి లేదు. భారత్‌ నుంచి ఈ–కామర్స్‌ ఎగుమతులు 2 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, చైనావి ఏకంగా 350 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ఈ–కామర్స్‌ వ్యాపారం 800 బిలియన్‌ డాలర్లుగా ఉండగా 2030 నాటికి 2 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా.  

4

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)