ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో భారీగా ఇన్వెస్ట్‌ చేయండి

Published on Mon, 12/08/2025 - 07:44

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగం వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ కార్యదర్శి ఎ.పి. దాస్‌ జోషి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాసెసింగ్‌ స్థాయిని, ఎగుమతులను పెంచే దిశగా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్‌ చేయాలంటూ కార్పొరేట్లకు ఆయన సూచించారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు.

‘మనం భారీగా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నప్పటికీ సుమారు 12 శాతం మాత్రమే ప్రాసెస్‌ అవుతోంది. ఈ విషయంలో అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌లను అటుంచితే కనీసం ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌కి కూడా దగ్గర్లో లేము. దేశవ్యాప్తంగా 24 లక్షల ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉండగా, వాటిలో రెండు శాతమే సంఘటిత రంగంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు, దేశీయంగా ప్రైవేట్‌ పెట్టుబడులు పెట్టేందుకు గణనీయంగా ఆస్కారం ఉంది. దీని వల్ల గ్రామీణ రైతాంగానికి కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది‘ అని జోషి చెప్పారు.

2014–15లో మొత్తం వ్యవసాయ ఎగుమతుల్లో 11 శాతంగా ఉన్న ప్రాసెస్డ్‌ ఫుడ్‌ వాటా ప్రస్తుతం 22 శాతానికి పెరిగిందని తెలిపారు. 2030 నాటికి ఇది 30–32 శాతానికి చేరవచ్చని, పరిశ్రమకు అపరిమిత వృద్ధి అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన లేబర్‌ కోడ్‌లు, కార్మిక శక్తి ఎక్కువగా ఉండే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ తదితర రంగాలకు ప్రయోజనకరంగా ఉంటాయని వివరించారు.

Videos

చిన్న వయసులోనే చాలా చూశా.. బోరున ఏడ్చేసిన కృతిశెట్టి

Vasupalli Ganesh: రీల్స్ నాయుడు.. రాజీనామా చేసి ఇంట్లో కూర్చో

ఆమె పక్కన కూర్చోవాలంటే సిగ్గేసేది.. సమంతపై శోభారాజు కామెంట్స్..!

తిరుపతికి కొత్త రైలు..16వేల‌ కోట్లతో ఏపీకి భారీ బడ్జెట్

పని చేయకుండా రీల్స్ చేస్తే ఇలానే ఉంటది చంద్రబాబు, రామ్మోహన్ పై పేర్ని నాని సెటైర్లే సెటైర్లు

టీడీపీకి భారీ షాక్.. YSRCPలో చేరిన 100 కుటుంబాలు

Perni Nani: మరోసారి బాబు అబద్దాలు.. 10 లక్షల కోట్లు అప్పు అంటూ

KA Paul: నన్నే అడ్డుకుంటారా చంద్రబాబుపై KA పాల్ ఫైర్

Puducherry: కరూర్ తొక్కిసలాట తర్వాత తొలి ర్యాలీలో పాల్గొన్న విజయ్

Big Shock To Indigo: ఇండిగో సర్వీస్‌పై DGCA కోత

Photos

+5

‘అన్నగారు వస్తారు’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘న‌య‌నం’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

హార్దిక్‌ పాండ్యా సూపర్‌ షో...తొలి టి20లో భారత్‌ ఘన విజయం (ఫొటోలు)

+5

గ్లోబల్‌ సమిట్‌లో సినీ ప్రముఖుల సందడి.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ (చిత్రాలు)

+5

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. డే2 స్పెషల్‌ ఎట్రాక్షన్స్‌ ఇవిగో (ఫొటోలు)

+5

స్వదేశీ దుస్తుల్లో ఆదితి రావు హైదరీ నేచురల్‌ బ్యూటీ లుక్ (ఫొటోలు)

+5

ప్రతిరోజూ మిస్ అవుతున్నా.. 'కేదార్‌నాథ్' జ్ఞాపకాల్లో సారా (ఫొటోలు)

+5

Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు విక్రమ్ ప్రభు (ఫోటోలు)

+5

యూత్‌ను గ్లామర్‌తో కొల్లగొట్టిన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

తరుణ్ భాస్కర్,ఈషా రెబ్బ 'ఓం శాంతి శాంతి శాంతి’ టీజర్ రిలీజ్ (ఫొటోలు)