కరెన్సీ నోట్లలో కీలక మార్పు!

Published on Tue, 08/11/2026 - 19:31

కరెన్సీ నోట్ల విషయంలో కేంద్రం ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న పేపర్ నోట్లకు బదులుగా పాలిమర్‌(ప్లాస్టిక్)తో తయారు చేసిన నోట్లను ప్రయోగాత్మకంగా తీసుకురావడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది.

ముందు రూ.10, రూ.20 నోట్లపై ఈ ప్రయోగం చేయనున్నారు. ఒక్కో డినామినేషన్‌కు 100 కోట్ల నోట్లను తయారు చేసి, ప్రజల మధ్య చలామణిలోకి తీసుకువచ్చి ఎలా పనిచేస్తాయో పరిశీలించనున్నారు. ఇది విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని పాలిమర్ కరెన్సీ నోట్లు వచ్చే అవకాశం ఉంటుంది.

కొత్త పాలిమర్ నోట్లు వస్తున్నాయని.. పాత పేపర్ నోట్లు వెంటనే రద్దు అవుతాయని ప్రజలు భయపడాల్సిన అవకాశం లేదు. ఎందుకంటే.. ప్రస్తుతం ఉన్న పేపర్ నోట్లతో పాటు కొత్త పాలిమర్ నోట్లు కూడా చలామణిలో ఉంటాయి. ముందుగా ఈ నోట్లు రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడుతున్నాయి, ఎంతకాలం మనగలుగుతున్నాయి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి వంటి విషయాలను రిజర్వ్ బ్యాంక్ పరిశీలిస్తుంది.

ట్రయల్స్ సక్సెస్ అయితే.. తర్వాత వీటిని రెగ్యులర్‌గా చలామణిలోకి తీసుకురావాలని ఆర్‌బీఐ ఆలోచిస్తోంది. పాలిమర్ నోట్లు.. కాగితం నోట్ల కంటే కొంత భిన్నంగా ఉంటాయి. ఇవి పలుచని ప్లాస్టిక్ లాంటి పదార్థంతో తయారవుతాయి. అందువల్ల నీటికి, తేమకు, దుమ్ముకు తట్టుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.

పేపర్ నోట్లతో పోలిస్తే ఎక్కువ కాలం ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు. నకిలీ నోట్లను తయారు చేయడం కూడా కొంత కష్టంగా ఉండేలా భద్రతా ఫీచర్లు ఏర్పాటు చేయవచ్చు. ఆస్ట్రేలియా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాల్లో ఇప్పటికే కొన్ని పాలిమర్ నోట్లు వాడుతున్నారు. భారత్‌లో కూడా గతంలో పరిమిత స్థాయిలో వీటిని పరీక్షించారు.

కొత్త నోట్లు ఎప్పటి నుంచి మన చేతుల్లోకి వస్తాయనేది మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. పాలిమర్ నోట్ల తయారీకి సంబంధించిన ప్రక్రియ ఇంకా మొదటి దశలోనే ఉందని ప్రభుత్వం తెలిపింది. నోట్ల తయారీకి అవసరమైన మెటీరియల్, ప్రింటింగ్ ఏర్పాట్లు, ట్రయల్స్ ఎక్కడ నిర్వహించాలి వంటి విషయాలపై ఇంకా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

ఇదీ చదవండి: హైదరాబాద్​లో ట్రంప్ టవర్స్!

Videos

భారతి సిమెంట్స్ కేసులో కూటమి ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు

చిరు NEXT మూవీ టైటిల్ లీక్.. వద్దు వద్దు అంటున్న ఆపుకోలేక నోరు జారిన చిరంజీవి

ఆ సీఐ చుట్టూ కూటమి రాజకీయం..!

LB నగర్ పీఎస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

కేకును కోస్తే అరెస్ట్ చేసి నడి రోడ్డుపై నడిపించారు.. మెడికల్ విద్యార్థిని ప్రియాంకను చంపేస్తే మాత్రం వారిని

నేడు MLA, MLCలతో వైఎస్ జగన్ కీలక సమావేశం

నా కాలు విరిగినా.. నా ప్రాణం పోతాదన్నా జగనన్న కోసం ఎలాంటి కష్టానైనా...

EVM ట్యాపరింగ్ జరిగిందో లేదో చంద్రబాబే చెప్పాలి..! ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్

రాజమండ్రి పోలీసులు అందరూ ఎలాంటివారంటే..! డాక్టర్ ప్రియాంక ఘటనపై అడ్వకేట్ బాల కామెంట్స్

నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి... సీదిరి అప్పలరాజు భార్య సంచలన వ్యాఖ్యలు

Photos

+5

హైదరాబాద్‌లో మొదలైన వినాయక చవితి 2026 సందడి (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌...(ఫొటోలు)

+5

‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)

+5

హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు)

+5

ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు)

+5

ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)

+5

యంగ్ హీరోతో నయన్ లవ్ పోజులు (ఫొటోలు)

+5

‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు)