Breaking News

గూగుల్‌కు బాంబు బెదిరింపు కలకలం: హైదరాబాదీ అరెస్ట్‌

Published on Mon, 02/13/2023 - 13:15

సాక్షి, ముంబై: సెర్చ్‌ ఇంజీన్‌ దిగ్గజం గూగుల్‌కు బాంబు బెదిరింపు కాల్‌ కలకలం రేపింది. మహారాష్ట్ర పూణేలోని గూగుల్ కార్యాలయంలో బాంబు పెట్టినట్లు  ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న గూగుల్ ఆఫీస్‌కు కాల్ రావడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పోలీసులు ఫిర్యాదు చేశారు.  అయితే  సంఘటనా స్థలంలో ఎలాంటి బాంబు లేకపోవడంతో  గందరగోళం సద్దుమణిగింది. 

ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ఉన్న గూగుల్ కార్యాలయానికి ఆదివారం రాత్రి 7.54 గంటలకు కాల్ వచ్చింది. దీనిపై  సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు.  పూణే పోలీసులు, బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని విస్తృతంగా సోదాలు నిర్వహించి, ఇది ఫేక్‌అని  పూణే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ V) విక్రాంత్ దేశ్‌ముఖ్  తేల్చారు.  

అనంతరం గుర్తుతెలియని వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అయితే హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి మద్యం మత్తులో ఈ కాల్‌ చేసినట్టు అధికారులు గుర్తించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడిని అదుపులోకితీసుకున్నామనీ, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)