Breaking News

Google Layoffs: ఆగని కోతలు.. ఈ సారి ఎంత మందినో..?

Published on Fri, 02/17/2023 - 13:15

టెక్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు ఆగడం లేదు. ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌లో వరుస లేఆఫ్స్‌ కొనసాగుతున్నాయి. తాజాగా మరికొందరిని వదిలించుకుంది. గూగుల్‌ ఇండియా వివిధ విభాగాల్లో మొత్తం 453 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. తొలగించిన ఉద్యోగులకు గురువారం అర్ధరాత్రి మెయిల్స్‌ వెళ్లినట్లు  తెలిసింది. 

బిజినెస్‌లైన్ నివేదిక ప్రకారం.. గూగుల్ ఇండియా కంట్రీ హెడ్, వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా ఈ మెయిల్స్‌ పంపారు. గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ ప్రపంచవ్యాప్తంగా 12,000 మందిని లేదా మొత్తం ఉద్యోగుల్లో  6 శాతం మందిని తొలగించనున్నట్లు  గత నెలలో ప్రకటించింది. అయితే ప్రస్తుతం తొలగించిన 453 ఉద్యోగాలు గతంలో ప్రకటించిన 12,000 ఉద్యోగాల కోతల్లో భాగామేనా లేక కొత్త రౌండ్ లేఆఫ్‌లు ఉన్నాయా అన్నది ధ్రువీకరించలేదు.

ఉద్యోగులకు పంపిన మెయిల్స్‌లో సీఈఓ సుందర్ పిచాయ్ నుంచి కూడా కొన్ని ఇన్‌పుట్‌లు ఉన్నట్లు తెలిసింది. తొలగింపులకు దారితీసిన నిర్ణయాలకు తాను పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఆయన అంగీకరించారు. జనవరిలో పంపిన నోట్‌లో యూఎస్ వెలుపల తొలగించిన గూగుల్ ఉద్యోగులకు స్థానిక నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా రావాల్సినవన్నీ అందుతాయని ఆయన పేర్కొన్నారు.  

గూగుల్‌లోనే ఇతర టెక్ కంపెనీల్లోనూ లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. అమెజాన్ తన వర్క్‌ఫోర్స్ నుంచి 18 వేల మందిని తొలగించాలని యోచిస్తోంది. ఇది తొలుత 10 వేల మందికే పరిమితం అనుకున్నా తర్వాత ఈ అంచనా మరింత పెరిగింది. మెటా కూడా 13 వేల మంది ఉద్యోగులను తొలగించింది.

(ఇదీ చదవండి: లేఆఫ్‌ల ట్రెండ్‌.. మెటా అనూహ్య నిర్ణయం.. జుకర్‌బర్గ్‌ సెక్యూరిటీకి ఏకంగా 115 కోట్ల ఖర్చు!)

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)