Breaking News

ఉద్యోగులు ఆఫీస్‌కు రాకపోతే.. గూగుల్‌ కొత్త ఎత్తుగడ

Published on Wed, 06/11/2025 - 16:00

ఉద్యోగులను తగ్గించుకునేందకు టెక్‌ దిగ్గజం గూగుల్‌ కొత్త ఎత్తుగడ ఎత్తుకుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానం బలోపేతం పేరుతో సాధ్యమైనంత మేర ఉద్యగులను వదిలించుకునేందుకు ప్రణాళిక వేసింది. అమెరికాలో రిమోట్ వర్క్ విషయంలో గూగుల్ కఠినమైన విధానాన్ని తీసుకుంది. ఉద్యోగులను కార్యాలయానికి తిరిగి రావాలని లేదా స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీని ఎంచుకోవాలని కోరింది.

కొత్త ఆదేశాల ప్రకారం.. గూగుల్‌లోని కోర్, మార్కెటింగ్, రీసెర్చ్, నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ (కేఅండ్ఐ), కమ్యూనికేషన్స్ సహా కీలక విభాగాల్లోని ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ విధానం ప్రధానంగా గూగుల్ కార్యాలయానికి 50 మైళ్ల లోపల నివసించే ఉద్యోగులను ప్రభావితం చేస్తుంది. ఇది పనిప్రాంత అంచనాలలో గణనీయమైన మార్పును సూచిస్తుంది.

ఈ పరివర్తనను సులభతరం చేయడానికి, గూగుల్ కొత్త మార్గదర్శకాలను పాటించని యూఎస్ ఆధారిత ఉద్యోగులకు స్వచ్ఛంద తొలగింపు ప్యాకేజీలను అందిస్తోంది. అయితే ఇవి తొలగింపులు కాదని గూగుల్ చెబుతున్నప్పటికీ, ఇలాంటి నిష్క్రమణ కార్యక్రమాలు చారిత్రాత్మకంగా విస్తృతమైన శ్రామిక శక్తి తగ్గింపులకు ముందు అమలవుతున్నవే.

ఉద్యోగుల వ్యక్తిగత సహకారం నేరుగా ఆఫీస్‌లలో ఉండాలని భావిస్తున్న గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఏఐ ఫోకస్డ్ కార్యక్రమాలనూ టెక్‌ దిగ్గజం వేగవంతం చేసింది. కంపెనీలు తమ సొంత రిమోట్ వర్క్ వ్యూహాలను పునఃసమీక్షిస్తున్నందున, ఈ విధానం టెక్ పరిశ్రమ అంతటా ప్రకంపనలు సృష్టిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

👉ఇది చదివారా? లక్షలకొద్దీ టెకీలు.. బెంగళూరు కొత్త రికార్డ్‌

గూగుల్‌ తాజా  ఈ ప్రకటన కొన్ని ఆందోళనలను రేకెత్తిస్తోంది. గతంలో గూగుల్ ఇదే తరహా ఎగ్జిట్ ఆఫర్లు ఇచ్చి ఉద్యోగాల కోత విధించింది. 2023లో కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించగా, ఈ ఏడాది కూడా ట్రెజరీ, బిజినెస్ సర్వీసెస్ వంటి విభాగాల్లో చిన్నపాటి తొలగింపులు చేపట్టింది. ఈసారి ఎంతమందిపై ప్రభావం పడుతుందో స్పష్టంగా తెలియనప్పటికీ.. గూగుల్ తన ఎక్కువ మంది సిబ్బందిని ఆఫీస్‌లకు తిరిగి రప్పించాలని భావిస్తోంది. ఇందుకు ఇష్టపడని వాళ్లు ఉద్యోగం వీడాల్సి ఉంటుంది.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)