‘జెమిని నోట్‌బుక్’లో ఉచితంగా వందలాది పుస్తకాలు!

Published on Sat, 11/07/2026 - 09:13

టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న ఏఐ విద్యార్థుల అభ్యాసన పద్ధతులను పూర్తిగా మార్చేస్తోంది. డిజిటల్ బోధనా రంగంలో మరో మైలురాయిగా నిలుస్తూ ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సరికొత్త సంచలనానికి తెరతీసింది. విద్యార్థులు ఎలాంటి రుసుము చెల్లించకుండా ఎంతో సులభంగా పరీక్షలకు సన్నద్ధమయ్యేలా తన ‘జెమిని నోట్‌బుక్’ (గతంలో నోట్‌బుక్‌ఎల్‌ఎం) ప్లాట్‌ఫారమ్‌లో వందలాది ఉచిత పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది.

‘ఎక్స్‌పర్ట్ ఇంటెలిజెన్స్’లో భాగంగా అప్‌డేట్

గూగుల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఎక్స్‌పర్ట్ ఇంటెలిజెన్స్’ ఇనిషియేటివ్‌లో భాగంగా ఈ అప్‌డేట్‌ను తీసుకొచ్చారు. భారత్, అమెరికా దేశాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు అధికారులు చెప్పారు. కేవలం ఇంటర్నెట్‌లో దొరికే సాధారణ సమాచారమే కాకుండా, విద్యార్థులు ప్రామాణికమైన పుస్తకాలను ఏఐ సాయంతో మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది. గతంలో గూగుల్ ప్లే బుక్స్ ద్వారా కొనుగోలు చేసిన ఈ-బుక్స్‌ను మాత్రమే జెమిని నోట్‌బుక్‌లో జోడించడానికి అనుమతి ఉండేది. కానీ తాజా అప్‌డేట్‌తో ఈ పరిమితి తొలగిపోయింది.

ప్రముఖ విద్యా ప్రచురణకర్తలైన ‘ఓపెన్‌స్టాక్స్’, ‘ఓపెన్ టెక్స్ట్ బుక్ లైబ్రరీ’తో పాటు భారత్‌కు చెందిన ప్రముఖ పబ్లిషర్ ‘ఎస్ చంద్ పబ్లిషింగ్’ వంటి సంస్థలకు చెందిన వందలాది పుస్తకాలను నేరుగా ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఉచితంగా పొందుపరిచారు.

విద్యార్థులకు లభించే ప్రయోజనాలు

సాధారణంగా విద్యార్థులు పరీక్షల సమయంలో రివిజన్ నోట్స్ తయారు చేసుకోవడానికి, ముఖ్యమైన అంశాలను వెతకడానికి గంటల తరబడి సమయం వెచ్చిస్తుంటారు. అయితే గూగుల్ జెమిని నోట్‌బుక్ ఈ కష్టాన్ని తగ్గిస్తుంది. విద్యార్థులు విడివిడిగా పుస్తకాలను పీడీఎఫ్‌ రూపంలో అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండానే నేరుగా ఈ డిజిటల్ లైబ్రరీ నుంచి పుస్తకాలను ఎంచుకోవచ్చు. దీని ద్వారా కింది ప్రయోజనాలుంటాయి.

  • విద్యార్థులు తమ సిలబస్‌కు తగినట్లుగా కీలక అంశాలను క్రోడీకరించి వ్యక్తిగత స్టడీ గైడ్లను క్షణాల్లో తయారు చేసుకోవచ్చు.

  • వివిధ చాప్టర్లు, సబ్జెక్టులపై తమకున్న అవగాహనను పరీక్షించుకోవడానికి ఏఐ సాయంతో ఆటోమేటిక్‌గా ప్రాక్టీస్ క్విజ్‌లను సృష్టించుకోవచ్చు.

  • ముఖ్యమైన నిర్వచనాలు, శాస్త్రీయ వాస్తవాలు, ప్రాథమిక భావనలను త్వరగా గుర్తుంచుకోవడానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫ్లాష్‌కార్డ్స్ ఉపయోగపడతాయి.

  • విద్యార్థులు అడిగే ప్రశ్నలకు జెమిని కేవలం ఏఐ జనరేటెడ్ సమాధానాలనే కాకుండా అసలు పాఠ్యపుస్తకంలో ఆ సమాచారం ఎక్కడ ఉందో సూచించే ఒరిజినల్ లింకులు, సైటేషన్లను కూడా అందిస్తుంది. దీనివల్ల సమాచార ప్రామాణికతను సరిచూసుకునే అవకాశం ఉంటుంది.

జెమిని నోట్‌బుక్‌ను ఎలా ఉపయోగించుకోవాలి?

  • మొదటగా (https://notebook.google/) వెబ్‌సైట్‌ను సందర్శించి మీ గూగుల్ ఖాతాతో సైన్-ఇన్ కావాలి.

  • ఒక కొత్త నోట్‌బుక్‌ను సృష్టించాలి లేదా ఇప్పటికే ఉన్న దాన్ని ఓపెన్ చేయాలి.

  • ఆపై ‘Add sources’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

  • అందుబాటులో ఉన్న కేటగిరీల నుంచి ‘Textbooks’ ఆప్షన్‌ను క్లిక్ చేసి మీకు కావలసిన పాఠ్యపుస్తకాన్ని ఎంపిక చేసుకోవాలి.

  • ఆ పుస్తకాన్ని మీ నోట్‌బుక్‌కు జోడించిన తర్వాత దానికి సంబంధించిన చాప్టర్లపై ప్రశ్నలు అడుగుతూ లెర్నింగ్ ప్రాసెస్ ప్రారంభించవచ్చు.

నిపుణుల హెచ్చరిక

ఈ టెక్నాలజీ విద్యార్థులకు మేలు చేస్తున్నప్పటికీ ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ స్వయంగా పుస్తకాలు చదవడం లేదా తరగతి గదిలో నేర్చుకునే పద్ధతులకు ప్రత్యామ్నాయం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏఐ అందించే సమాధానాల్లో కొన్నిసార్లు పొరపాట్లు ఉండే అవకాశం ఉన్నందున విద్యార్థులు ఎల్లప్పుడూ ఒరిజినల్ టెక్స్ట్ బుక్స్‌తో సరిపోల్చుకోవడం ఉత్తమం.

ఇదీ చదవండి: మాదేశం వచ్చినవారికి గుడ్‌న్యూస్‌!

Videos

గన్నవరంలో YSRCP ఘన విజయం.. వల్లభనేని వంశీ సంబరాలు

మా వాళ్లను బయటకు గెంటి.. ఆ నా కొడుకులు దొంగ ఓట్లు గుద్దుకుంటుంటే చూస్తున్నావా?

YSRCP గెలుపు తట్టుకోలేక మంత్రి సవిత అనుచరుల వీరంగం

ZPTC, MPTC ఎన్నికల్లో సత్తా చాటిన YSRCP.. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఘన విజయం

మొండిగా పోరాటం చేశాం.. దాని ఫలితమే ఈ ZPTC విజయం

గన్నవరంలో YSRCP 63 ఓట్ల మెజారిటీతో గెలుపు!

జైలర్ 2 కొత్త డేట్.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

తగ్గని బంగారం క్రేజ్... ఒక్క రోజే రూ. 60 వేల కోట్ల కొనుగోళ్లు

సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య కిరణ్మయి బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

తిరుపతిలో YSRCP గెలుపు...

Photos

+5

సందడే.. సందడి.. వెలుగుల ముంగిళ్లు (ఫోటోలు)

+5

దివాళి వేళ.. మెరిసిన శ్రీనిధి శెట్టి (ఫోటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)

+5

సంపూ 'కొబ్బరిమట్ట' రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

'రామాయణ'లో మండోదరి పాత్ర.. కాజల్ స్పెషల్ పోస్ట్ (ఫొటోలు)

+5

అదరగొట్టేస్తున్న అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నదా! (ఫొటోలు)

+5

బీచ్ ఒడ్డున పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ జోడీ (ఫొటోలు)

+5

ధనుష్ 'ఓం' సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

మనీష్‌ మల్హోత్రా ‘ప్రీ దివాలీ సెలబ్రేషన్స్‌’...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)