Breaking News

కనకం.. కొత్త శిఖరం!

Published on Sat, 08/09/2025 - 04:33

న్యూఢిల్లీ: అమెరికా విధానాల కారణంగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. వరుసగా రెండో రోజు కొనుగోళ్ల మద్దతుతో బంగారం దేశీయంగా నూతన జీవితకాల గరిష్టానికి (ఆల్‌టైమ్‌ హై) చేరుకుంది. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత బంగారం రూ.800 పెరిగి రూ.1,03,420 స్థాయికి చేరింది. గురువారం ఒక్కరోజే రూ.3,600 పెరగడం తెలిసిందే. ముఖ్యంగా గత ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో రూ.5,800 లాభపడింది. 

99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.800 పెరిగి రూ.1,03,000ను తాకింది. మరోవైపు వెండి కిలోకి రూ.1,000 పెరిగి రూ.1,15,000కు చేరుకుంది. గత ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో వెండి సైతం రూ.5,500 పెరిగింది. ‘‘స్విట్జర్లాండ్‌ నుంచి దిగుమతి అయ్యే కిలో, 100 ఔన్స్‌ల బంగారం బిస్కెట్లపై 39 శాతం టారిఫ్‌లను అమెరికా ప్రకటించడం కీలక సరఫరా మార్గంపై ప్రభావం చూపించింది. బులియన్‌ మార్కెట్లలో తాజా అస్థిరతలకు ఆజ్యం పోసింది.

 బంగారం రిఫైనరీకి కీలక మార్కెట్‌ అయిన స్విట్జర్లాండ్‌పై అమెరికా టారిఫ్‌లు విధించడం సరఫ రాలపరంగా అనిశి్చతికి దారితీసింది. దీనికి తోడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య సురక్షిత సాధనమైన బంగారానికి తిరిగి డిమాండ్‌ ఏర్పడింది’’ అని అబాన్స్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ సీఈవో చింతన్‌ మెహతా తెలిపారు. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా ప్రకటించిన టారిఫ్‌లు అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలకు దారితీశాయని, ఇవి బంగారం ధరల పెరుగుదలకు కారణమైనట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కమోడిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు. యూఎస్‌ ఫెడ్‌ సెపె్టంబర్‌లో రేట్ల కోతను చేపట్టొచ్చన్న అంచనాలు సైతం పెరిగినట్టు చెప్పారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్‌ బంగారం 3,534 డాలర్ల వద్ద నూతన జీవితకాల గరిష్టాన్ని తాకి.. 3,500 డాలర్ల  పైన ట్రేడ్‌ అవుతోంది.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)