Breaking News

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

Published on Sat, 02/01/2025 - 11:31

దేశంలో బంగారం ధరల (Gold Prices) పరుగు ఆగడం లేదు. వరుసగా నాలుగో రోజు కూడా పసిడి రేట్లు ఎగిశాయి. క్రితం రోజున ఆల్‌టైమ్‌ రికార్డ్‌కు చేరుకున్న ధరల పెరుగుదల నేడు  (February 1) కూడా కొనసాగింది. గడిచిన నాలుగు రోజుల్లో 10 గ్రాముల బంగారంపై రూ.2500 పైగా పెరిగింది. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ఇది చదివారా? యూపీఐకి క్రెడిట్‌ కార్డ్‌ లింక్‌.. లాభమా.. నష్టమా?

బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు రూ.150 (22 క్యారెట్స్), రూ.160 (24 క్యారెట్స్) చొప్పున పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 77,450కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 84,490 వద్దకు ఎగిశాయి.

ఇతర ప్రాంతాల్లో.. 
దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.84,640 వద్దకు.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.77,600 వద్దకు చేరాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.160,  రూ.150 చొప్పున పెరుగుదలను నమోదు చేశాయి.

ఇదీ చదవండి: ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా.. ఎప్పటినుంచంటే?

చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.150 పెరిగి రూ. 77,450 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.160 ఎగిసి రూ. 84,490 వద్దకు చేరింది. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.

వెండి ధరలు
దేశవ్యాప్తంగా వెండి ధరల్లో నేడు ఎలాంటి కదలిక లేదు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,07,000 వద్ద, ఢిల్లీలో రూ. 99,500 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)