భారీ అగ్నిప్రమాదం.. పక్కనే పెట్రోల్ బంకు..
Breaking News
ఐదేళ్లలో బంగారం మార్క్.. నిపుణుల కొత్త అంచనా!
Published on Sun, 03/29/2026 - 19:40
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరల్లో చాలా మార్పులు జరిగాయి. చాలామంది పెట్టుబడిదారులు విలువైన లోహాలపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ తరుణంలో ఫండ్స్‌ఇండియా గ్రూప్ సీఈఓ అక్షయ్ సప్రూ భవిష్యత్ పరిణామాల గురించి విశ్లేషించారు.
భౌగోళిక రాజకీయ పరిణామాలను నియంత్రించడం చాలా కష్టం. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చాలా జరిగాయి. భవిష్యత్తులోనూ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సంఘటనల కారణంగా.. పెట్టుబడిదారుడి తత్వం దారి తప్పకూడదని అక్షయ్ పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు ప్రస్తుతం పాత పద్దతులను వదిలిపెట్టి.. కొత్త విధానాలను అనుసరిస్తున్నారని అన్నారు.
బంగారం ర్యాలీ చాలా వరకు పూర్తయింది. రాబోయే ఐదేళ్లలో.. ఇది గత సైకిల్ మాదిరిగా రాబడులను అందించకపోవచ్చు. మీ పోర్ట్‌ఫోలియోలో బంగారం ఇప్పటికే 5-10 శాతం ఉంటే, ఆ కేటాయింపును కొనసాగించవచ్చు, కానీ పెట్టుబడిని గణనీయంగా పెంచడం మంచిది కాదు. గోల్డ్ సిప్‌లను కొనసాగించవచ్చు, కానీ కొత్తగా చేసే ఏకమొత్తం పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. వెండి విషయానికొస్తే, దాని అధిక అస్థిరత, నిలకడలేని రాబడుల కారణంగా సాధారణంగా చాలామంది దానికి ప్రాధాన్యత ఇవ్వరు అని అక్షయ్ సప్రూ పేర్కొన్నారు.
2030 నాటికి గోల్డ్ రేటు
ఇప్పుడు రూ.1,48,000 వద్ద బంగారం ధర 2030 నాటికి రూ.1.68 లక్షల నుంచి రూ. 2.25 లక్షల మధ్యకు చేరుకుంటుందని మరికొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణం సెంట్రల్ బ్యాంకుల భారీ కొనుగోళ్లు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఏర్పడే ఆర్థిక అనిశ్చితి అని చెబుతున్నారు.
ఇదీ చదవండి: 'ఏఐ ఎంత ఎదిగినా.. వీళ్ల ఉద్యోగానికి డోకా లేదు'
Tags : 1