థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు
Breaking News
బంగారం vs వెండి: పెట్టుబడికి ఏది బెస్ట్?
Published on Fri, 04/03/2026 - 18:22
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పెరిగినప్పుడు, పెట్టుబడిదారులు సాధారణంగా బంగారాన్ని ఒక సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. యుద్ధాలు, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభాలు వంటి సందర్భాల్లో బంగారం ధరలు పెరగడం అనేది సర్వ సాధారణం. అయితే.. ఈ సంవత్సరం (ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం) పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. ప్రపంచంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ, బంగారం ధరలు పెరగకపోవడం పెట్టుబడిదారులను కొంత ఆశ్చర్యానికి గురిచేసింది.
యుద్ధం సమయంలో బంగారం ధరలు పెరగకపోవడం వల్ల.. పెట్టుబడిదారులలో ఒక అనుమానం మొదలైంది. బంగారం కంటే వెండి మంచి పెట్టుబడిగా మారుతుందా?. దీనికి కారణం సిల్వర్ రేటు అమాంతం పెరగడమే.
గోల్డ్-సిల్వర్ రేషియో
ఇక పెట్టుబడిదారుల ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే.. ముందుగా గోల్డ్-సిల్వర్ రేషియో గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ రేషియో ఒక యూనిట్ బంగారం ధరకు సమానంగా ఉండే వెండి పరిమాణాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం ఈ రేషియో 60 కంటే ఎక్కువగా ఉండటం వల్ల, వెండి.. బంగారంతో పోలిస్తే చవకగా ఉందని అర్థమవుతోంది.
నిజానికి వెండి అనేది కేవలం ఒక విలువైన లోహం మాత్రమే కాదు. దీనిని పరిశ్రమల్లో కూడా కూడా విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సౌరశక్తి, ఇతర తయారీ రంగాలలో వెండికి మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగా.. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పుడు వెండి ధరలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల కొంతమంది నిపుణులు వెండిపై పెట్టుబడి చాలా ఉత్తమం అని అంటున్నారు.
వెండిపై పెట్టుబడి - జాగ్రత్త!
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. వెండిలో పెట్టుబడి పెట్టడం పూర్తిగా సేఫ్ అని చెప్పలేము. ఎందుకంటే ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. ఇటీవల వెండి ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ.. ఒక్కసారిగా భారీగా పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది పెట్టుబడిదారులకు పెద్ద నష్టాలను కలిగించే అవకాశం ఉంది. అందువల్ల, వెండిపై పెట్టుబడి పెట్టే విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలి.
బంగారం విలువను కోల్పోదు!
ఇక బంగారం విషయానికి వస్తే.. ఇది చాన్నాళ్లుగా, ఇప్పటికీ ఒక విశ్వసనీయమైన, సురక్షిత పెట్టుబడిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఆర్థిక అస్థిరత, కరెన్సీ విలువ తగ్గడం వంటి పరిస్థితుల్లో బంగారం స్థిరత్వాన్ని అందిస్తుంది. కాబట్టి బంగారం ఎప్పుడూ.. దాని విలువను కోల్పోదు.
సమతుల్యత ఉత్తమం!
పెట్టుబడిదారులు ఎప్పుడూ కూడా.. ఒక లోహాన్ని పూర్తిగా వదిలి మరొకదానిలో పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయం కాదు. బంగారం స్థిరత్వాన్ని అందిస్తే, వెండి వృద్ధి అవకాశాలను అందిస్తుంది. కాబట్టి.. పెట్టుబడిదారులు తమ రిస్క్ సామర్థ్యాన్ని బట్టి బంగారం, వెండి మధ్య సమతుల్యతను పాటిస్తూ పెట్టుబడి పెట్టడం ఉత్తమం.
ఇదీ చదవండి: ఉద్యోగం కోసం ఆఫీసుకు పోతే..: టెకీకి ఎదురైన అనుభవం!
Tags : 1