Breaking News

ఈ ఏడాది 850 టన్నులు!.. బంగారానికి భారీ డిమాండ్

Published on Tue, 09/17/2024 - 18:13

భారతదేశంలో 2024 ఏప్రిల్ నుంచి ఆగష్టు వరకు బంగారం దిగుమతులు 22.70 బిలియన్ డాలర్లు పెరిగాయి. దేశంలో పసిడికి డిమాండ్ పెరగటం వల్ల దిగుమతులు గతంలో కంటే కూడా గణనీయంగా పెరిగాయి.

బంగారం దిగుమతులు పెరగడానికి ప్రధాన కారణం.. సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, పండుగ సీజన్‌లో పెరిగిన డిమాండ్‌తో నగల వ్యాపారులు కొనుగోలు చేయడం మాత్రమే కాకుండా యూనియన్ బడ్జెట్‌లో గోల్డ్ ట్యాక్స్ తగ్గించడం అని తెలుస్తోంది. అయితే  రత్నాలు, రత్నాలకు సంబంధించిన ఆభరణాల ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి.

2024 మొదటి త్రైమాసికం కంటే.. రెండో త్రైమాసికంలోనే బంగారం దిగుమతులు పెరిగాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సెమీ అర్బన్, గ్రామీణ మార్కెట్ కూడా పెరిగింది. పండుగ సీజన్ కోసం దేశం సిద్ధమవుతున్నందున, పెరుగుతున్న బంగారం డిమాండ్‌ను తీర్చడానికి రిటైలర్లు తమ స్టోర్ నెట్‌వర్క్‌లను విస్తరిస్తున్నారు.

జులై యూనియన్ బడ్జెట్‌లో బంగారం మీద ట్యాక్ తగ్గించడం కూడా బంగారం కొనుగోళ్లను బాగా పెంచింది. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కూడా కలిసొచ్చింది. మొత్తం మీద 2024లో భారతదేశంలో బంగారం డిమాండ్ 850 టన్నులకు చేరుకుంటుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) అంచనా వేసింది. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే సుమారు 12 శాతం ఎక్కువ.

ఇదీ చదవండి: ఏఐకు అదో పెద్ద సవాలు: తీవ్ర పరిణామాలకు దారి తీయొచ్చు

పెరుగుతున్న ధరలు
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నెలలోనే తులం బంగారం ధర ఏకంగా రూ. 2000 పెరిగింది. ఈ రోజు (సెప్టెంబర్ 17)న గోల్డ్ రేటు రూ.  74890 (తులం 24 క్యారెట్స్) వద్ద ఉంది. ఈ ధరలు ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)