కొత్త ఏడాది బంగారం కొనడం కష్టమే!.. ఎందుకో తెలుసా?

Published on Fri, 12/27/2024 - 10:58

దేశంలో బంగారం ధరలు మరోమారు పెరిగాయి. నేడు (డిసెంబర్ 27) గోల్డ్ రేటు గరిష్టంగా రూ.270 పెరిగింది. దీంతో భారతదేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఈ రోజు బంగారం ధరలను గురించి తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.78,000 కాగా.. 22 క్యారెట్ల ధర రూ.71,500 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి.

దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. అయితే ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 78,150 రూపాయలు, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,650.

పసిడి ధరలు చెన్నైలో కూడా పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. కాబట్టి ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.78,000 కాగా.. 22 క్యారెట్ల రేటు రూ.71,500 వద్ద ఉంది. ధరలు ఎలా ఉన్నా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

వెండి ధరలు
దేశంలో బంగారం ధరలు కొంత పెరిగినప్పటికీ.. వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ రోజు కేజీ వెండి ధర రూ. 1,00,000 వద్ద నిలిచింది. బంగారం, వెండి ధరలు పెరగడం వల్ల.. కొత్త ఏడాది ప్రారంభంలో గోల్డ్, సిల్వర్ కొనాలనుకునే.. కొనుగోలుదారులు కొంత ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)