Breaking News

ఓపెన్‌ఏఐని మించిపోనున్న గూగుల్

Published on Fri, 12/05/2025 - 21:34

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో 'గాడ్‌ఫాదర్'గా ప్రసిద్ధి చెందిన, టొరంటో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జెఫ్రీ హింటన్ ఏఐ రేసులో గూగుల్ కంపెనీ త్వరలో ఓపెన్‌ఏఐని మించిపోతుందని అంచనా వేశారు. గూగుల్ తన ఏఐ సాంకేతికతను తెలివిగా స్కేలింగ్ చేస్తూ ముందంజ వేయనుందని స్పష్టం చేశారు.

బిజినెస్ ఇన్‌సైడర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హింటన్ మాట్లాడుతూ, ‘గూగుల్ ఓపెన్‌ఏఐని అధిగమించడానికి ఇంత సమయం పట్టడం ఆశ్చర్యకరంగా ఉంది. త్వరలో గూగుల్‌ ఓపెన్‌ఏఐని మించిపోతుంది’ అని అన్నారు. మెషిన్ లెర్నింగ్‌లో తన ప్రయోగాలకు 2024లో నోబెల్ ఫిజిక్స్ బహుమతిని అందుకున్న హింటన్ గూగుల్‌లో పనిచేసిన తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఏఐ రంగంలో గూగుల్ మొట్టమొదటగా ముందంజలో ఉందని, అయితే తర్వాత వెనక్కి తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ‘గూగుల్ ఇతరుల కంటే ముందు చాట్‌బాట్‌లను తయారు చేసింది’ అని హింటన్ అన్నారు.

జెమిని 3, నానో బనానా ప్రో

ఈ మార్పుకు ప్రధాన ఆధారాలు గూగుల్ తాజా మోడళ్లు జెమిని 3, నానో బనానా ప్రో అని చెప్పారు. ఈ మోడళ్ల ప్రారంభం తర్వాత గూగుల్ ఏఐ రేసులో ముందుందని టెక్ రంగంలో విస్తృతంగా ప్రశంసలు వస్తున్నాయి. వినియోగదారులు కూడా ఈ మోడళ్ల అధునాతన సామర్థ్యాలపై సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. నిపుణుల అంచనాల ప్రకారం, జెమిని 3 మోడల్ ఓపెన్‌ఏఐ జీపీటీ-5తో పోలిస్తే అద్భుతమైన పనితీరు సంఖ్యలను ప్రదర్శిస్తోందని కొందరు చెబుతున్నారు.

ఇదీ చదవండి: సమస్యలన్నింటికీ ఒకే పరిష్కారం

#

Tags : 1

Videos

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)