Breaking News

జెన్‌ జెడ్‌ పారిశ్రామికవేత్తలు చాలా స్మార్ట్‌

Published on Thu, 05/14/2026 - 08:27

యువ పారిశ్రామికవేత్తలు ఎంతో స్మార్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక్క విభాగానికి పరిమితం కాకుండా ఒకటికి మించిన ఆదాయ మార్గాలతో విజయాల మోత మోగిస్తున్నారు. దాదాపు 75 శాతం మంది జెన్‌ జెడ్‌ పారిశ్రామికవేత్తలు  (1997–2012 మధ్య జన్మించిన వారు) ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులను కలిగి ఉన్నట్టు లింక్డ్‌ఇన్‌ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం..  

  • పాత తరంతో పోలిస్తే నేటి యువత మరింత సరళతర పని నమూనాల వైపు అడుగులు వేస్తున్నారు. జెన్‌ జెడ్‌లో ప్రతీ నలుగురిలో ముగ్గురు (75 శాతం) తమకు ఒకటికి మించి ఆదాయ వనరులున్నట్టు చెప్పారు.  

  • జెన్‌ ఎక్స్‌ (1965–1980 కాలంలో జన్మించిన వారు)లో కేవలం 62 శాతం మందికి మాత్రమే ఒకటికి మించిన ఆదాయ వనరులు ఉన్నాయి.  

  • వృత్తిపై పూర్తి నియంత్రణ సాధించడంతో పాటు, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఈ తరం తమ కెరీర్‌ను మలుచుకుంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వ్యాపార ధోరణులకు భారత్‌ నిదర్శనంగా నిలుస్తున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. గడిచిన ఏడాది కాలంలో భారత్‌లో తమ ప్రొఫైల్‌లో ‘వ్యవస్థాపకుడు’ అని జోడించుకున్న వారి సంఖ్య 104 శాతం పెరిగింది. ఏ ఇతర దేశంతో పోల్చినా భారత్‌లోనే ఇది అధికమని ఈ నివేదిక తెలిపింది.  

  • 500 మంది చిన్న వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధిలోని వారిని ప్రశ్నించి లింక్డ్‌ఇన్‌ ఈ వివరాలు రూపొందించింది.  

  • వ్యయాలు, అనుభవం లేకపోవడం వంటి సంప్రదాయ అవరోధాలను ఏఐ, డిజిటల్‌ టూల్స్‌ తగ్గిస్తున్నాయి. దీని వల్ల వ్యాపారం ప్రారంభించడం కొత్త తరానికి సులభతరంగా మారింది.  

  • 85 శాతం మంది యువ వ్యవస్థాపకులు తమ వ్యాపార వృద్ధికి ఏఐ ఎంతో కీలకమని భావిస్తున్నారు.  

  • తమ నేపథ్యంతో సంబంధం లేకుండా పారిశ్రామికేవేత్తలుగా అవతరించే అవకాశాలు ప్రస్తుం ఉన్నట్టు 80 శాతం మంది చెప్పారు. గతంతో పోలి్చతే నేడు మరింత సులభతరం అయినట్టు 81 శాతం మంది తెలిపారు.  

  • భారత్‌లో జెన్‌జెడ్‌ విజయం అంటే కేవలం డబ్బు అనుకోవడం లేదు. 64 శాతం మంది స్వేచ్ఛ, సౌలభ్యం, 56 శాతం వ్యక్తిగత అభివృద్ధి, 55 శాతం మంది ఆర్థిక సంపదను నిజమైన విజయంగా భావిస్తున్నారు. వీటిని సాధించేందుకు రిస్క్‌ తీసుకునేందుకూ వెనుకాడడం లేదు.  

ఏఐతో అందరికీ అవకాశాలు..

‘‘ఒకప్పుడు అసాధ్యం అనుకున్న వ్యాపార కలలను నేడు ఏఐ నిజం చేస్తోంది. ఒకే ఉద్యోగానికి పరిమితం కాకుండా, రకరకాల ఆదాయ మార్గాలను సృష్టించుకునేందుకు, అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తోంది’’ అని లింక్డ్‌ఇన్‌ భారత మేనేజర్‌ కుమారేష్‌ పట్టాభిరామన్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్‌పై జోహో ప్రకటన

Videos

జగన్ కోసం పోటెత్తిన జనం.. ఎక్కడికి వెళ్లినా జన సునామి

దుబారాలో మనమే టాప్.. బాబు.. లోకేష్ జల్సాలు

బుల్డోజర్ కింద బైకులు పిండి పిండి

జై జగన్ జై జగన్!! దద్దరిల్లిన YSRCP ఆఫీస్

లోకేష్ జల్సాలు..స్పెషల్ ఫ్లైట్లో పుట్టపర్తికి..భారీ కాన్వాయ్ లో చక్కర్లు

2 వాహనాలతో మోదీ కాన్వాయ్ 8 వాహనాలతో లోకేష్ కాన్వాయ్

YSRCPలో చేరిన తరువాత మోపిదేవి శ్రీనివాసరావు ఫస్ట్ రియాక్షన్

తెలుగు రాష్ట్రాలకు తీపి కబురు ముందుగానే రుతుపవనాలు

మోపిదేవికి జగన్ హామీ..

జగన్ సమక్షంలో పార్టీలో చేరిన మోపిదేవి శ్రీనివాసరావు

Photos

+5

శ్రీకాకుళం : అంగరంగ వైభవంగా నీలమ్మ తల్లి పండుగ (ఫొటోలు)

+5

ఫారిన్ వెకేషన్‌లో మహేశ్ బాబు ఫ్యామిలీ.. (ఫోటోలు)

+5

కేన్స్ వీధుల్లో మెగా డాటర్ నిహారిక సందడి.. (ఫోటోలు)

+5

పొలిటికల్‌ స్టైల్‌ షో.. ఈ అదిరే లుక్స్‌ చూశారా?..

+5

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేసిన నటి ఊర్వశీ రౌతేలా (ఫొటోలు)

+5

చిత్తూరు గంగజాతర... కనులపండువగా అమ్మవారి దివ్యరూపం (ఫొటోలు)

+5

‘దూరదర్శని’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విడాకుల రూమర్స్.. ట్రెండింగ్‌లో మౌనీరాయ్ (ఫొటోలు)

+5

అరుణాచలం ట్రిప్‌లో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

తెలంగాణ : కోరిన కోరికలు తీర్చే అద్భుత శక్తులు కలిగిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)