Breaking News

తీవ్ర నేరారోపణలు.. సైబర్‌ క్రైమ్‌ యూనిట్‌ సోదాలు

Published on Wed, 02/04/2026 - 11:57

ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోని ఎక్స్ కార్యాలయాలపై ఆ దేశ సైబర్ క్రైమ్ యూనిట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. చట్టవిరుద్ధమైన డేటా వెలికితీత, చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి తీవ్రమైన నేరారోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు ఎక్స్ యాజమాన్యం ధ్రువీకరించింది.

దర్యాప్తు నేపథ్యం..

ఈ వివాదం 2025 జనవరిలో ప్రారంభమైంది. ఎక్స్ ప్లాట్‌ఫామ్ తన యూజర్లకు సిఫార్సు చేసే అల్గారిథమ్‌ ఆధారిత కంటెంట్‌పై పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టింది. ఈ దర్యాప్తు క్రమంగా ఎక్స్ వివాదాస్పద ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ వరకు విస్తరించింది. అయితే, ఈ చర్యలను ఎక్స్ తీవ్రంగా ఖండించింది. జులై 2025లో స్పందిస్తూ.. ఈ విచారణ అంతా రాజకీయ ప్రేరేపితమని, తమ అల్గారిథమ్‌ను తారుమారు చేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది.

ఎక్స్ ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోపణలు

  • పిల్లల అశ్లీల చిత్రాలను కలిగి ఉండటం. వాటిని ఇతరులతో పంచుకోవడంలో ప్లాట్‌ఫామ్ ప్రమేయం ఉండటం.

  • అనుమతి లేకుండా మహిళల లైంగికపరమైన డీప్‌ఫేక్‌(రియల్‌ ఇమేజ్‌లను తలపించేలా ఏఐ ద్వారా సృష్టించే చిత్రాలు) చిత్రాలను సృష్టించడం ద్వారా వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించడం.

  • వ్యవస్థీకృత సమూహాల ద్వారా మోసపూరిత పద్ధతుల్లో డేటాను సేకరించడం.

  • ముఖ్యంగా గ్రోక్ చాట్‌బాట్ మహిళల అసభ్య చిత్రాలను రూపొందిస్తోందన్న వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపాయి. దీనిపై యూరోపియన్ కమిషన్, యూకే రెగ్యులేటర్లు ఇప్పటికే విచారణ ప్రారంభించాయి.

ఎక్స్‌ను ఉపయోగించబోం..

విచారణ తీవ్రతరం కావడంతో పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. తాము ఇకపై ఎక్స్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించబోమని, అధికారిక సమాచారం కోసం లింక్డ్‌ఇన్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ఇతర సామాజిక మాధ్యమాలను ఆశ్రయిస్తామని ప్రకటించింది.

గతంలో టెలిగ్రామ్‌పై చర్యలు

టెక్ దిగ్గజాలపై ఫ్రాన్స్ కఠినంగా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. 2024 ఆగస్టులో కంటెంట్ మోడరేషన్ లోపాలపై టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్‌ను ఫ్రాన్స్ అధికారులు అరెస్టు చేశారు. ప్లాట్‌ఫామ్ కార్యకలాపాల్లో మార్పులు చేసిన తర్వాతే గత మార్చిలో ఆయనను దేశం విడిచి వెళ్లడానికి అనుమతించారు. ప్రస్తుతం ఎక్స్ ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం సోషల్ మీడియా నియంత్రణల విషయంలో ఐరోపా దేశాల కఠిన వైఖరిని స్పష్టం చేస్తోంది.

ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే..

Videos

KLSR రేవంత్ బినామీ కంపెనీ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

బ్రేకప్ గురించి నోరు విప్పిన మృణాల్ ఠాకూర్..!

నీయవ్వ తగ్గేదేలే..! పుష్ప & ధురంధర్ డైరెక్టర్ మూవీ..!

శ్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన అమ్మాయి.. అర్ధరాత్రి గజగజ వణికిన డెలివరీ బాయ్

ఒక మాజీ మంత్రిని పోలీసులతో కొట్టిస్తారా? సినిమా మాములుగా ఉండదు

పోలీసుల సమక్షంలోనే అంబటి హత్యకు కుట్ర

కాపు కులంలో అంబటి అన్న ఒక టైగర్ పోలీసులకు మాస్ వార్నింగ్

మేం కూడా మీలాగే ప్లెక్సీలు పెడితే ఒప్పుకొంటావా చంద్రబాబు?

గూండాలను వేసుకొచ్చి దాడి చేయిస్తావా? గల్లా మాధవిపై జగన్ ఫైర్

అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేంటి?

Photos

+5

శరత్ కుమార్-రాధిక పెళ్లిరోజు.. కూతురి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

జగన్‌ రాకతో దద్దరిల్లిన గుంటూరు (చిత్రాలు)

+5

అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. మరిన్ని కొత్త (ఫొటోలు)

+5

ఫుడ్ అంటే ఎంత ఇష్టమో.. ఆషికా క్రేవింగ్స్ (ఫొటోలు)

+5

పశ్చిమ గోదావరిలో ఎంతో ఫేమస్ ఈ ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

నెట్‌ఫ్లిక్స్ గ్రాండ్ ఈవెంట్.. సగం బాలీవుడ్ ఇక్కడే ఉందిగా (ఫొటోలు)

+5

జ్యోతిర్లింగాల యాత్ర మొదలుపెట్టిన హీరోయిన్ (ఫొటోలు)

+5

క్యూట్ జోడీ.. జనవరి ఎంజాయ్ చేశారిలా (ఫొటోలు)

+5

అనసూయ డైలీ రొటీన్ ఇదే.. పోస్ట్ వైరల్ (ఫొటోలు)