Breaking News

త్వరలో 50 శాతం వైట్‌కాలర్‌ జాబ్స్‌ కనుమరుగు

Published on Sat, 07/05/2025 - 19:45

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొందరికి భవిష్యత్తుపై ఆశావహాన్ని పెంచితే ఇంకొందరి కొలువులకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ముఖ్యంగా ఏఐ వల్ల వివిధ పరిశ్రమల్లోకి వైట్ కాలర్ ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ఫైనాన్స్, లా, హెల్త్ కేర్, టెక్నాలజీ వంటి పరిశ్రమల్లో వైట్ కాలర్ ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆక్రమించే అవకాశం ఉందని టెక్ లీడర్లు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో అమెరికాలోని వైట్ కాలర్ ఉద్యోగాల్లో 50 శాతం కృత్రిమ మేధతో భర్తీ అవతాయని ఫోర్డ్ మోటార్ సీఈఓ జిమ్ ఫార్లే తెలిపారు.

ఆస్పెన్ ఐడియాస్ ఫెస్టివల్‌ కార్యక్రమంలో రచయిత వాల్టర్ ఐజాక్‌సన్‌తో ఫార్లే మాట్లాడుతూ..‘కృత్రిమ మేధ అమెరికాలోని వైట్ కాలర్ కార్మికుల్లో సగం మందిని భర్తీ చేయబోతోంది. భవిష్యత్తులో కృత్రిమ మేధ కేవలం ఉత్పాదకతను పెంపొందించే సాధనంగా మాత్రమే ఉండబోదు. పరిపాలనా, నిర్వహణ, సాంకేతిక ఉద్యోగాల్లో సిబ్బంది సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది’ అన్నారు.

ఇదీ చదవండి: లేదని బాధపడకు.. వశం చేసుకోవాలని ఆరాటపడు!

అంతకుముందు మే నెలలో జేపీ మోర్గాన్ ఛేజ్‌లో కన్జ్యూమర్ అండ్ కమ్యూనిటీ బ్యాంకింగ్ విభాగం అధిపతి మరియానే లేక్ ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ.. ఏఐ ఇంటిగ్రేషన్ కారణంగా కార్యకలాపాల హెడ్ కౌంట్‌ను 10 శాతం తగ్గించాలని బ్యాంక్ భావిస్తోందని చెప్పారు. అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ కూడా భవిష్యత్తులో కార్పొరేట్ శ్రామిక శక్తి తగ్గిపోతుందని అంచనా వేశారు. 

#

Tags : 1

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)