Breaking News

తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ?

Published on Mon, 09/15/2025 - 09:02

అమెరికా సుంకాలు భారత వాణిజ్యంపై ప్రభావం చూపుతున్న దృష్ట్యా కొన్ని సడలింపులు కావాలని  దేశీయ ఎగుమతిదారులు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖను కోరుతున్నారు. యూఎస్ సుంకాలతో దెబ్బతింటున్న ఉత్పాదకత, సరఫరా సవాళ్లకు తాత్కాలిక పరిష్కారంగా ఇప్పటికే తీసుకున్న రుణాలపై వడ్డీని తొలగించాలంటున్నారు. డిసెంబర్‌ 2024లో ముగిసిన వడ్డీ ఈక్వలైజేషన్ స్కీమ్ (ఐఈఎస్)ను పునరుద్ధరించాలని లేదా ఎగుమతి ప్రోత్సాహక రూపంలో డ్యూటీ క్రెడిట్ స్క్రిప్‌లను(దిగుమతి చేసుకునే ముడి సరుకుపై సుంకాల సడలింపు) తిరిగి ప్రవేశపెట్టాలని చెబుతున్నారు. అయితే అందుకు మంత్రిత్వశాఖ సుముఖంగా లేదని తెలుస్తుంది. ఈ అంశం ఇంకా చర్చల్లో ఉందని అధికారులు చెబుతున్నారు.

ఎగుమతిదారులు ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) డిసెంబర్ 2024లో ముగిసిన ఐఈఎస్‌ను కొనసాగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. గతంలో ఈ పథకం కింద ప్రభుత్వం ఎగుమతి రుణంపై వడ్డీ రేట్లను మాఫీ చేసింది. భారతీయ ఎగుమతిదారులు వారి రుణ ఖర్చులను తగ్గించుకునేందుకు ఇది ఎంతో తోడ్పడుతుందని, దాని ద్వారా కొత్త మార్కెట్‌ల్లో ఎగుమతులను పెంచే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

‘ఐఈఎస్ లేదా డ్యూటీ క్రెడిట్ స్క్రిప్స్ ద్వారా నేరుగా ఎగుమతులు పెరుగుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ నమ్మడం లేదు. దీనిపై ఎగుమతిదారులు, వాణిజ్య విభాగం మధ్య చర్చలు జరుగుతున్నాయి’ అని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి చెప్పారు. 2026 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో రూ.2,250 కోట్ల వార్షిక వ్యయంతో ఎగుమతి ప్రోత్సాహక మిషన్‌ను ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇది గతంలో ఐఈఎస్ కింద చేసిన పంపిణీల కంటే చాలా తక్కువగా ఉంది.

ఇదీ చదవండి: స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఎస్‌డబ్ల్యూపీ మంచిదా?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)