IT Return: పొరపాటు జరిగిందా? రిటర్న్‌ని రివైజ్‌ చేసుకోవచ్చు..

Published on Mon, 10/21/2024 - 08:36

ఒరిజినల్‌ రిటర్ను వేశారు. వెరిఫై కూడా అయింది. కానీ మీరు ఆ రిటర్నుని చెక్‌ చేసుకుంటే, ఏవైనా పొరపాట్లు జరిగి ఉండొచ్చు. వాటిని సరిదిద్దుకుని రివైజ్డ్‌ రిటర్న్‌ దాఖలు చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. సాధారణంగా ఎటువంటి పొరపాట్లు జరుగుతాయంటే .. 
    
» కూడిక, తీసివేతల్లో తప్పులు 
» ఆదాయం మర్చిపోవడం.. పరిగణనలోకి తీసుకోకపోవడం 
» ఆదాయం లెక్కించడంలో పొరపాటు జరగడం 
» మినహాయింపులు, తగ్గింపులు మొదలైనవి మర్చిపోవడం 
» ట్యాక్స్‌ లెక్కింపులో తప్పులు 
» టీడీఎస్‌లో పొరపాట్లు 
» అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించినవి మర్చిపోవడం 
» మినహాయింపు మొదలైనవాటిని తప్పుగా, ఎక్కువగా క్లెయిమ్‌ చేయడం 
» బ్యాంకు అకౌంటు వివరాలు తప్పుగా ఇవ్వడం 
» ఒక ఫారంనకు బదులుగా మరొక ఫారం వేయడం

సెక్షన్‌ 139(5) ప్రకారం మీరు మీ ఒరిజినల్‌ రిటర్నుని రివైజ్‌ చేసుకోవచ్చు. రివైజ్డ్‌ రిటర్న్‌ అంటేనే ఒరిజినల్‌ రిటర్న్‌కి బదులుగా అని .. మరొక రకంగా ‘రిప్లేస్‌మెంట్‌’ అని చెప్పవచ్చు. ఇలా వేయడంలో గతవారం చెప్పినట్లుగా రూ. 1,000/5,000 చెల్లించనవసరం లేదు. మీరు సకాలంలో వేసినట్లే. అయితే, పన్ను కట్టాల్సి ఉంటే పన్నుతో పాటు వడ్డీ చెల్లించాలి.

ఎప్పటిలోగా ఈ రిటర్ను వేయొచ్చు.. 
మీరు వేసిన ఒరిజినల్‌ రిటర్నుకి సంబంధించి అసెస్‌మెంట్‌ ఆర్డర్లు వచ్చేలోగా లేదా 2024 డిసెంబర్‌ 12లోగా .. (ఈ రెండింటిలో ఏది ముందు అయితే అది). గడువుతేదీ తర్వాత రిటర్ను వేసిన వాళ్లు కూడా రివైజ్డ్‌ రిటర్ను వేయొచ్చు. ఇలా ఎన్నిసార్లు రివైజ్‌ చేయొచ్చు .. అంటే ఎన్నిసార్లయినా రివైజ్‌ చేయొచ్చు. ఎటువంటి ఆంక్షలు, పరిమితులు లేవు. అలా అని మాటిమాటికీ చేయకండి.

రివైజ్‌ చేయాల్సిన అవసరం వస్తే ఈ కింది జాగ్రత్తలు తీసుకోండి సుమా.. 
» మళ్లీ పొరపాటు జరగకుండా జాగ్రత్త తీసుకోండి 
» సమగ్రంగా అన్ని వివరాలు సేకరించండి 
» రివైజ్‌ రిటర్న్‌ ఆప్షన్‌ను ఎంచుకోండి 
» సరైన ఐటీఆర్‌ను ఎంచుకోండి 
» ఒరిజినల్‌ రిటర్ను వివరాలన్నీ ఇవ్వాలి లేదా అప్‌లోడ్‌ చేయాలి 
» మిగతా పద్ధతంతా షరా మామూలే

మనంతట మనమే రివైజ్‌ చేస్తున్నాం. మళ్లీ మళ్లీ చేయడం సబబు కాదు. సమంజసం కాదు. రివైజ్‌ చేయడానికి కారణాలు సాంకేతికపరమైనవి, చిన్న చిన్నవైతే ఫర్వాలేదు. కానీ పెద్దవి అయితే మాత్రం మీ రివైజ్డ్‌ రిటర్నుని స్క్రూటినీ కోసం సెలెక్ట్‌ చేసే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోండి.

 

పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్‌ పంపించగలరు. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)