Breaking News

స్టాక్‌ మార్కెట్‌లో నిండా మునిగాడు.. ఇప్పుడు రూ.2.4 కోట్ల వేతనం!

Published on Thu, 08/14/2025 - 14:40

జీవితమంటేనే కష్టాలు, కన్నీళ్లు. వీటికి భయపడకుండా పట్టుదలతో కృషి చేస్తేనే.. సక్సెస్ సాధ్యమవుతుంది. దీనిని నిరూపించినవాళ్ల గురించి గతంలో చాలానే తెలుసుకున్నాం. ఇప్పుడు తాజాగా ఇదేకోవకు చెందిన మరో వ్యక్తి గురించి.. అతని సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం.

2008లో ఢిల్లీలోని ఒక మధ్యతరగతి కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి స్టాక్ మార్కెట్లో సర్వసం కోల్పోయాడు. కానీ కొడుకు దశాబ్దానిపైగా కృషి చేసి.. కెరీర్‌ను అద్భుతంగా నిర్మించుకున్నాడు. ఏడాదికి రూ. 2.4 కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు.

ఢిల్లీలో మధ్య తరగతిలో పుట్టి పెరిగిన ఆ వ్యక్తి (కొడుకు).. ప్రారంభ జీవితం చాలా సాఫీగా సాగింది. అయితే 2008లో ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ చదువుకునే రోజుల్లోనే.. పాఠశాలలో నాటకాలు, డ్యాన్స్ ఇతర కార్యకలాపాలలో పాల్గొనేవాడు. ఇంటర్మీడియట్‌లో సైన్స్ ఎంచుకున్నాడు. ఆ తరువాత ఢిల్లీ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో తన బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు.

చదువు పూర్తయిన తరువాత 2014లో నెలకు రూ. 35,000 జీతంతో ఉద్యోగం సంపాదించాడు. 2016లో తన స్నేహితురాలికి దగ్గరగా ఉండాలని ఉద్యోగం మారాడు. అప్పుడు అతని జీతం రూ. 60,000లకు పెరిగింది. 2017లో మరొక ఉద్యోగంలో చేరాడు. అప్పుడు అతని జీతం రూ. 90,000లకు చేరింది. ఐదేళ్లు అదే కంపెనీలు ఉంటూ.. 2021 నాటికి నెలకు రూ. 2 లక్షల జీతం సంపాదించే స్థాయికి ఎదిగాడు.

ఇదీ చదవండి: వెండి నగలు కొంటున్నారా?: సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్!

2022లో విదేశాల్లో ఉద్యోగం చేయడానికి ఆఫర్ వచ్చింది. అక్కడ అతని వార్షిక వేతనం 202000 డాలర్లు (రూ.1.7 కోట్ల కంటే ఎక్కువ). 2025 నాటికి అతని వేతనం రూ. 2.4 కోట్ల కంటే ఎక్కువ అయింది. కేవలం రూ. 35000 జీతంతో మొదలైన వ్యక్తి.. రూ.2.4 కోట్ల వేతనం వరకు ఎదిగాడంటే.. దాని వెనుక అతని శ్రమ ఎంత ఉంటుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

ఉద్యోగం చేసే సమయంలో.. జీవితాన్ని ఆస్వాదించడం కొనసాగించారు. మొత్తం నాలుగు ఖండాల్లో 17 దేశాలు ప్రయాణించాడు. తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. చిన్నప్పుడు ఎడ్ల బండిలో ప్రయాణించిన ఇతడు.. లగ్జరీ విమానాలలో ప్రయాణించే వరకు ఎదిగాడు. డబ్బు ఒక నిర్దిష్ట స్థాయి వరకు ముఖ్యమైనదని, కానీ దానికి మించి, ఆరోగ్యం, సంబంధాలు, అనుభవాలు ప్రాధాన్యత ఇవ్వాలని ఆ వ్యక్తి చెబుతాడు. జీవితంలో ఏ దశలోనైనా డబ్బు సంపాదించవచ్చు, కానీ సమయాన్ని తిరిగి పొందలేమని పేర్కొన్నారు.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)