Breaking News

ఫ్యాషన్ టైకూన్‌ ఇసాక్ ఆండిక్ కన్నుమూత

Published on Sun, 12/15/2024 - 13:05

ఫ్యాషన్ సామ్రాజ్యం ‘మ్యాంగో’ వ్యవస్థాపకుడు, అధినేత ఇసాక్ ఆండిక్ కన్నుమూశారు. శనివారం ఆయన పర్వత ప్రమాదంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆండిక్ వయసు 71 ఏళ్లు. బార్సిలోనా సమీపంలోని మోంట్‌సెరాట్ గుహలలో బంధువులతో హైకింగ్ చేస్తుండగా కొండపై నుండి 100 మీటర్లకు పైగా జారి పడిపోయాడని పోలీసు ప్రతినిధి తెలిపారు.

"మాంగో నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు ఇసాక్ ఆండిక్ ఆకస్మికంగా మృతి చెందారని తెలియజేయడానికి చింతిస్తున్నాం" అని కంపెనీ సీఈవో టోని రూయిజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన నిష్క్రమణ భారీ శూన్యతను మిగిల్చిందని, ఆయన కంపెనీ కోసం జీవితాన్ని అంకితం చేశారని, వ్యూహాత్మక దృష్టి, స్ఫూర్తిదాయకమైన నాయకత్వంతో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.

ఇస్తాంబుల్‌లో జన్మించిన ఆండిక్ 1960లలో ఈశాన్య స్పానిష్ ప్రాంతమైన కాటలోనియాకు వలస వెళ్లి 1984లో ఫ్యాషన్‌ బ్రాండ్‌ మ్యాంగోను స్థాపించారు. ఫోర్బ్స్ ప్రకారం ఆయన నెట్‌వర్త్‌ 4.5 బిలియన్‌ డాలర్లు. ఆయన ప్రస్తుతం కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫాస్ట్ ఫ్యాషన్ రిటైలర్ అయిన ఇండిటెక్స్ అధినేత అమాన్సియో ఒర్టెగాను ఢీకొట్టిన వ్యాపారవేత్త ఆండిక్.

తిరుగులేని బ్రాండ్‌
దాదాపు 2,800 స్టోర్‌లతో యూరప్‌లోని అతిపెద్ద ఫ్యాషన్ గ్రూపులలో మ్యాంగో ఒకటిగా ఉంది. దాని వెబ్‌సైట్ ప్రకారం మ్యాంగో గ్రూప్‌ ప్రపంచవ్యాప్తంగా 120 కంటే ఎక్కువ దేశాలలో వ్యాపారాలు నిర్వహిస్తోంది. 15,500 మంది ఉద్యోగులతో  ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ గ్రూపులలో ఒకటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 2023లో కంపెనీ టర్నోవర్ 3.1 బిలియన్ యూరోలు.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)